Monday, August 3, 2026 06:01 PM
Monday, August 3, 2026 06:01 PM

గంభీర్ కెరీర్ వర్సెస్ ఒక్క మ్యాచ్..!

టి20 వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ ఎలాగో భారత్ ఫైనల్ చేరుకుంది. సెమీస్ లో ఇంగ్లీష్ జట్టుపై సాధించిన విజయంతో.. భారత్ వరుసగా రెండవ సారి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఇక్కడ ఓడిపోయిన సంగతి క్రికెట్ అభిమానులకి గుర్తుండే ఉంటుంది. మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోయిన పరిస్థితి. ఇలాంటి టైంలో అహ్మదాబాద్ మైదానం భారత్ కు ఎంత వరకు అనుకూలంగా ఉంటుంది, విశ్వ విజేతగా నిలవడం భారత్ కు సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.

Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!

అయితే.. భారత జట్టు కంటే కూడా హెడ్ కోచ్ గా గంభీర్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా చెప్పాలి. కారణం.. గంభీర్ వచ్చిన తర్వాత భారత జట్టు ఎన్నో దారుణ ఓటములు ఎదుర్కొన్న మాట వాస్తవం. 2024 లో టి20 వరల్డ్ కప్ తో హెడ్ కోచ్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి స్వదేశంలో, విదేశాల్లో భారత్ ఎక్కువగా ఇబ్బంది పడింది. జట్టులో ఎన్నో ప్రయోగాలు గంభీర్ చేస్తూ వచ్చాడు. కీలక ఆటగాళ్లను టి20 లకు పక్కన పెట్టి.. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా విపరీతమైన మార్పులు చేర్పులు చేస్తూ ఆటగాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేశాడని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా.

Also Read : భారత్ ను కెలికిన అమెరికా.. అదిరిపోయే రిప్లై..!

ప్రయోగాలు ఎక్కువగా ఫెయిల్ కావడంతో గంభీర్ పై ఒత్తిడి కూడా పెరిగింది. ఈ టైంలో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్.. గంభీర్ కు అత్యంత కీలకం అనే చెప్పాలి. టి20 వరల్డ్ కప్ తనకు లాస్ట్ ఛాన్స్ గా గంభీర్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే తాను కోచ్ గా కొనసాగుతాను అనే సంకేతాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. బోర్డు కూడా అందుకే ఓపికగా ఎదురు చూస్తుంది అనే మాట కూడా ఉంది. నచ్చిన ఆటగాళ్లను రంగంలోకి దించిన గంభీర్ కు.. మరి ఆటగాళ్ళు కూడా ఎంత వరకు సహకారం ఇస్తారో చూడాలి. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు నెలలు.. భారత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడదు. మరి ఈ కీలకమైన మ్యాచ్ లో ఎంత వరకు రాణిస్తారో..? దీంతో గంభీర్ కెరీర్ కి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

పోల్స్