Friday, June 19, 2026 05:02 PM
Friday, June 19, 2026 05:02 PM

ఫేక్ పోస్ట్ లతో మోడీ పరువు తీస్తున్నారా..?

సాధారణంగా రాజకీయాల్లో, సినిమాల్లో, ఏ రంగంలో అయినా తాము అభిమానించే వారికి ఎలివేషన్ ఇవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి కాస్త ఎక్కువైన మాట వాస్తవం. ఇప్పుడు కొందరు ప్రధాని మోడీ భక్తులు సోషల్ మీడియాలో ఆయనకు ఇస్తున్న ఎలివేషన్ లు కాస్త కామెడీగా మారుతున్నాయనే మాట వినపడుతోంది. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం సహా పలు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది.

Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!

భారత్ కాస్త ప్రశాంతంగా ఉంది. దీనితో ఎలివేషన్ లు స్టార్ట్ చేసిన భక్తులు.. మోడీకి వేసిన ఓటు వృధా కాలేదని, మోడీ కారణంగానే దేశం ఇలా ఉందని.. సైనిక శక్తిని మోడీ బలోపేతం చేసారని, ఇరాన్ కు భారత మిలటరీ విమానాలను పంపించి విద్యార్ధులను తీసుకుని వస్తున్నారని.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్ట్ లు వైరల్ చేస్తున్నారు. మోడీ మిలిటరీ డ్రెస్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. వీటికి వస్తున్న రియాక్షన్స్, కామెంట్స్ లో మోడీని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

Also Read :స్వామి అంటే నమ్మకం లేదా..? అసెంబ్లీ లో బాబు ఫైర్..!

మోడీ రాకముందే భారత సైనిక వ్యవస్థ బలంగా ఉందని, త్రివిధ దళాలను అంతకు ముందే బలోపేతం చేసారని కొందరు కామెంట్ చేస్తుంటే.. కేంద్రం తప్పిదాల కారణంగా ఇప్పుడు భారత్ చమురు కొరత ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది అంటూ మరికొందరు.. హార్మోజ్ జల సంధి గురించి ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో కేంద్రం వైఖరి కారణంగా రూపాయి బలహీనపడింది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇరాన్ కు మిలటరీ విమానం పంపారు అనే పోస్ట్ కూడా కామెడి అయింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నుంచి ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. కేంద్రం విధానాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది అని మరికొందరు విమర్శలకు దిగారు. ఇలా సోషల్ మీడియా పోస్ట్ లు మోడీకి ప్లస్ కాకపోగా మైనస్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్