Friday, June 19, 2026 05:06 PM
Friday, June 19, 2026 05:06 PM

మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. వెనిజులా అధ్యక్షుడుని కిడ్నాప్ చేసిన తర్వాత మరింత దూకుడు పెంచారు. ప్రస్తుతం ఆయన ఇరాన్ విషయంలో చేస్తోన్న యుద్ధం.. ప్రపంచ దేశాలకు పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఈ యుద్ధం ముగియక ముందే ట్రంప్ మరో యుద్దానికి అడుగులు వేస్తున్నారు. దక్షిణ అమెరికా దేశాలను తన కంట్రోల్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : స్వామి ఆశీస్సులతోనే కొత్త పార్టీ.. కవిత సంచలనం..!

తాజాగా క్యూబా పై ఫోకస్ చేసారు ట్రంప్. దశాబ్దాలుగా క్యూబా అమెరికాకు లొంగడం లేదు అనే మాట వాస్తవం. కమ్యూనిస్ట్ ప్రభుత్వం నడుస్తోన్న ఆ దేశంపై ఇప్పుడు దండ యాత్ర చేసేందుకు ప్లాన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. క్యూబాపై దృష్టి సారించే ముందు ఇరాన్‌లో యుద్ధాన్ని ముగించాలని తన ప్రభుత్వం భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటన చేసారు. మధ్యప్రాచ్యంలో వివాదం ముగిసిన తర్వాత.. అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలలో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read : ముగిసిన నితీష్ కుమార్.. సిఎం ప్రస్తానం..!

మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్ ఇంటర్ మయామి సిఎఫ్ వేడుకల సందర్భంగా వైట్ హౌస్‌లో మాట్లాడుతూ, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ భాగస్వామ్యంలో శత్రువును పూర్తిగా నాశనం చేస్తుందని ఆయన తెలిపారు. షెడ్యూల్ కంటే ముందుగానే తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇరాన్ సైనిక శక్తి భారీగా క్షీణించినట్లు ట్రంప్ వెల్లడించారు. వారికి వైమానిక దళం లేదు, వైమానిక రక్షణ లేదని ట్రంప్ కామెంట్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్