Wednesday, April 8, 2026 06:17 PM
Wednesday, April 8, 2026 06:17 PM

పయ్యావుల విశ్వరూపం.. హాట్ హాట్ గా మండలి..!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వాడీ, వేడిగా సాగుతున్నాయి. తాజాగా వైసీపీ నేతలు దూకుడు పెంచి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కల్తీ లడ్డుకి సంబంధించి వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి ఛైర్మన్ తిరస్కరించారు. లడ్డు వ్యవహారంపై నిరసన తెలిపే క్రమంలో హిందువులు కలియుగ దైవంగా భావించే వేంకటేశ్వరస్వామి ఫొటోలను చెప్పులు, షూలు వేసుకొని మండలిలో అడుగుపెట్టారు వైకాపా మండలి సభ్యులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : బ్రేకింగ్: జగన్ కు హెరిటేజ్ ఫుడ్స్ షాక్..!

సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేసింది. వేంకటేశ్వరస్వామి ఫోటోలు సభకు తీసుకురావడంపై మంత్రుల ఆగ్రహం వ్యక్తం చేసారు. విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహంతో మైక్ విసిరేశారు ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్. దేవుడంటే వైసీపీకి నమ్మకం, భయం లేవు.. వైసీపీ సభ్యులు దేవుడ్ని రాజకీయాల్లోకి లాగి హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని పయ్యావుల మండిపడ్డారు. దేవుడి ఫోటోలను సభలోకి తెచ్చి ఇలా రచ్చ చేయడం సరికాదన్నారు.

Also Read : ఈ జట్టుతో కప్ కొడతారా..? భారత్ పై తీవ్ర విమర్శలు..!

దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్ విసిరేశారు. ఇదిలా ఉంచితే.. వేంకటేశ్వరస్వామికి శాసనమండలిలో జరిగిన అవమానంపై మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. వైసీపీ సభ్యులు వేంకటేశ్వరస్వామి ఫోటోలను ప్లకార్డులా వాడి, మహాపచారానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించింది శాసన సభా పక్షం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రోజాకు బిగుస్తున్న ఉచ్చు.....

వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన...

భోగాపురం ముహుర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

బ్రేకింగ్ : రెడ్డప్పగారి...

పార్టీ కేడర్‌ను పట్టించుకోని నేతలపై టీడీపీ...

దేవాదాయ శాఖలో ఏసీబీ...

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్...

కేసీఆర్ బయటకు వస్తారా.....

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ...

తమిళనాడులో అలా.. మరి...

చట్టం అందరికీ సమానమే. బాధితులకు న్యాయం...

పోల్స్