Wednesday, October 7, 2026 07:49 AM
Wednesday, October 7, 2026 07:49 AM

బ్రేకింగ్: జగన్ కు హెరిటేజ్ ఫుడ్స్ షాక్..!

దాదాపు 20 రోజుల నుంచి హెరిటేజ్ సంస్థ కేంద్రంగా ఏపీలో రాజకీయాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. తమపై కూటమి నేతలు కల్తీ నెయ్యి ఆరోపణలు చేయడం, ఈ అంశంలో సిట్ అధికారులు వాస్తవాలు బయటపెట్టడంతో తెలివిగా వైసీపీ.. హెరిటేజ్ ను ఈ వివాదంలో లాగి విమర్శలకు దిగింది. ఈ నేపధ్యంలో తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ వైసీపీ అధినేత జగన్ కు షాక్ ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌పై ఉద్దేశపూర్వకంగా, పునరావృతంగా మరియు రాజకీయ దురుద్దేశంతో సాగిన అసత్య, తప్పుదారి పట్టించే, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపింది.

Also Read : తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈ మేరకు వైఎస్ జగన్ కు లీగల్ నోటీసులు జారీ చేసామని పేర్కొంది. దేశవ్యాప్తంగా మూడు దశాబ్దాలకు పైగా నాణ్యత, పారదర్శకత, వినియోగదారుల నమ్మకంపై నిలబడ్డ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారని మండిపడింది. వాటిని ఆధారంగా చేసుకుని వార్తలు ప్రచురించడం నిజాలను వక్రీకరించిన తీవ్రమైన దుష్ప్రచారమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ నెయ్యి సరఫరా, కల్తీ, కుట్రలు, “సిండికేట్” వంటి పదాలతో హెరిటేజ్ ఫుడ్స్‌ను నేర సంస్థలా చిత్రీకరించడం పూర్తిగా అసత్యం, ఆధారరహితం మరియు చట్టవిరుద్ధంగా అభివర్ణించింది సంస్థ.

Also Read : పిఠాపురంలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న పవన్..!

ప్రజలను ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టేందుకు, కంపెనీ పరువును కూల్చివేయాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేయబడ్డాయని లీగల్ నోటీసులో ప్రస్తావించింది హెరిటేజ్. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలు పూర్తిగా చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, అక్రమ కుమ్మక్కులున్నట్టు ప్రచారం చేయడం ఘోరమైన అబద్ధ ప్రచారమని కంపెనీ మండిపడింది. వైఎస్ జగన్, వైసీపీ నేతలు చేసిన తప్పుడు, దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజల ముందే షరతుల్లేని బహిరంగ క్షమాపణ ప్రకటించాలని హెరిటేజ్ డిమాండ్ చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్