Saturday, May 23, 2026 04:24 PM
Saturday, May 23, 2026 04:24 PM

పిఠాపురంలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న పవన్..!

2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఘన విజయం సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇన్ని రోజలు రాజకీయ సమస్యలతో నియోజకవర్గంలో కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. కీలక నాయకత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు సహకారం తగ్గింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అదే విధంగా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయడం లేదనే ఆవేదన కూడా అక్కడ వ్యక్తమైంది.

Also Read : అన్నీ తెలిసే ఆడుకుంటున్నారు.. మీకో నమస్కారం..!

అభివృద్ధి జరుగుతున్నా.. చేసే నాయకుడు జాడ లేకపోతే.. లేని పోనీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కూటమి నాయకత్వం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి కూడా పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పాలి. ఇక ఇప్పుడు నియోజకవర్గం నుంచి కీలక ప్రకటనకు పవన్ రెడీ అయ్యారు. ఉప్పాడ మత్స్యకారుల కోసం పిఠాపురం వేదికగా భారీ ప్రకటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్దమైనట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Also Read : మైండ్ గేమ్ లో బొత్స సక్సెస్ అయ్యారా..?

గత అక్టోబర్‌లో మత్స్యకారులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలను పవన్ అన్వేషించారు. సముద్ర కోత నివారణ, కాలుష్య నియంత్రణపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతుల్లో వేట, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, ఇతర ఉపాధి అవకాశాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు డిప్యూటి సిఎం. మెరైన్ ఫిషరీస్ నిపుణులు, ఉన్నతాధికారుల సలహాలతో పక్కా రోడ్ మ్యాప్ రెడీ చేసిన పవన్.. త్వరలోనే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ప్రకటన చేయనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

పోల్స్