దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల విడుదలతో పాటు రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల నుంచి తాజా సమాచారం అందుతోంది.
Also Read : రాయలసీమలో చంద్రబాబు మార్క్.. డ్రిప్ ఇరిగేషన్ నుంచి హార్టీకల్చర్ హబ్ వరకు
దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు, పలువురు కేంద్ర మంత్రులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దసరా పండుగ ముగిసిన వెంటనే అక్టోబర్ మూడో వారంలో లేదా ఆ తర్వాత ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని ఢిల్లీ టాక్. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా చర్చించనున్నారు.
Also Read : కొత్త లుక్‌తో మార్కెట్లోకి హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్..!
ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో టీడీపీకి తగిన ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ఈ విస్తరణలో ఆ పార్టీకి మరిన్ని కేబినెట్ లేదా సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ నుంచి మరో సీనియర్ ఎంపీకి కేబినెట్ ర్యాంకు గానీ, లేదా సహాయ మంత్రి పదవి గానీ దక్కే సూచనలు ఉన్నాయి. దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక గవర్నర్ పదవుల భర్తీపై కూడా చంద్రబాబు ఈ పర్యటనలో స్పష్టత తెచ్చుకోనున్నారు.


