Tuesday, October 6, 2026 10:57 PM
Tuesday, October 6, 2026 10:57 PM

విజయనగరం టీడీపీలో విచిత్ర పరిస్థితి.. తమ్ముళ్ల మైండ్ బ్లాక్..!

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా, అదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిన్నశ్రీను వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన తర్వాత జిల్లాలోని టీడీపీ కార్యాలయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పార్టీ కోసం కష్టపడిన పాత కాపులు పక్కకు పోయి.. నిన్నటివరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు, కార్యకర్తలే ఇప్పుడు టీడీపీ ఆఫీసుల్లో హల్‌చల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : రాయలసీమలో చంద్రబాబు మార్క్.. డ్రిప్‌ ఇరిగేషన్‌ నుంచి హార్టీకల్చర్ హబ్‌ వరకు

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అక్రమ కేసులు, బెదిరింపులు, వ్యాపారాలపై దాడులతో స్థానిక వైసీపీ నేతలు పసుపు సైన్యాన్ని తీవ్రంగా వేధించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పార్టీ జెండాను కాపాడుకుంటూ వచ్చిన నిఖార్సైన టీడీపీ కార్యకర్తలకు ఇప్పుడు సొంత ఆఫీసుల్లోనే విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. నిన్నటివరకు తమను ఇబ్బంది పెట్టిన తాజా వైసీపీ మాజీలే.. ఇప్పుడు పార్టీ మారిన పెద్దలు చిన్నశ్రీను అనుచరుల ముసుగులో వచ్చి టీడీపీ ఆఫీసులను ఆక్రమించేస్తుండటంతో పాత తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

చిన్నశ్రీను పార్టీ మారిన వెంటనే ఆయనతో పాటు భారీగా తరలివచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు జిల్లాలోని ప్రధాన టీడీపీ కార్యాలయాల్లో తిష్ట వేశారు. దీంతో నాడు కేసులకు భయపడకుండా పార్టీ కోసం నిలబడ్డ పాత కార్యకర్తలకు కనీస గౌరవం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. “నాడు మమ్మల్ని ఏడిపించిన వాళ్లే.. నేడు మా ఆఫీసుల్లో కూర్చుని పెత్తనం చేస్తుంటే ఎలా సహించాలి..?” అంటూ పలువురు టీడీపీ సీనియర్లు అంతర్గతంగా మండిపడుతున్నారు.

Also Read : వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

రాజకీయ సమీకరణాల కోసం చేరికలను ప్రోత్సహించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో నమ్ముకున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడం పార్టీకి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వలస నేతల హడావుడి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో అసలైన కేడర్ నైరశ్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ తలనొప్పిని విజయనగరం జిల్లా టీడీపీ నాయకత్వం, అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

గవర్నర్ కోటా పైనే...

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల...

పోల్స్