Tuesday, October 6, 2026 11:34 PM
Tuesday, October 6, 2026 11:34 PM

కళ తప్పిన అయోధ్య.. యూపీ ఎన్నికలపై ప్రభావం..!

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతం స్థానిక వ్యాపారులు, హోటళ్లపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. చోరీ ఘటనకు ముందు రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య 25 శాతం వరకు తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రోజుకు రూ.10 వేలు సంపాదించే ప్రసాదాల వ్యాపారి ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించడానికి కష్టాలు పడుతున్నాడు. చివరికి వాహన నిర్వహణ ఖర్చులు కూడా భరించలేకపోతున్నట్లు

Also Read : బరువు తగ్గాలంటే అన్నం మానేయకూడదా..?

వాహన నిర్వహణ ఖర్చులను కూడా భరించలేకపోతున్నట్లు ఈ-రిక్షా డ్రైవర్లు చెబుతున్నారు. కొన్ని రోజులుగా వ్యాపారం తక్కువగా ఉందని హోటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హోటళ్లలో రూముల బుకింగ్ 25 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం 100 కొత్త హోటళ్లు అయోధ్య చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్నాయి. మతపరమైన పర్యాటకం త్వరగా కోలుకోకపోతే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా మంది హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు విరాళాల చోరీ ఘటన వల్లే తమ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయని నమ్ముతున్నారు.

విరాళాల చోరీపై స్థానిక సాధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవస్థ వైఫల్యంగా కాకుండా, పరిపాలనా వైఫల్యంగా పేర్కొన్నారు. కేవలం కొందరు కింది స్థాయి ఉద్యోగుల తప్పిదంగా దీన్ని అభివర్ణించారు. శంకరాచార్యులు, మఠాధిపతులకు ట్రస్ట్‌లో చోటు కల్పించాలని కోరుతున్నారు. కొత్త ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?

తొమ్మిది నెలల తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో విరాళాల చోరీ వివాదం విపక్షాలకు ప్రధాన రాజకీయ అంశంగా మారింది. దీంతో రామాలయాన్ని తమ సైద్ధాంతిక చిహ్నంగా కలిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నష్ట నివారణ ప్రచారాన్ని చేపట్టాయి. ఈ ఉదంతంపై సిట్ దర్యాపు కొనసాగుతున్నదని.. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని.. ట్రస్టులో కీలక సంస్కరణలు ప్రవేశపెడుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య సద్దుమణగక ముందే ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ నష్టం వాటిల్లుతుందనే భయంతో ఎన్నికలను ముందుకు జరుపడానికి బీజేపీ సుముఖంగా లేదని సమాచారం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్