Saturday, May 23, 2026 05:29 PM
Saturday, May 23, 2026 05:29 PM

బ్రేకింగ్: సంచలన ప్రకటన చేసిన కవిత..!

గత ఏడాది కాలంగా తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఆందోళనలకు వేదిక అయ్యారు. పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత, అగ్ర నేత హరీష్ రావు విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు ఓ సంచలనం. క్రమంగా తన సోదరుడు కేటిఆర్ విషయంలో కూడా కవిత అదే దూకుడు ప్రదర్శించిన పరిస్థితి. ఇక కవిత రాజకీయ ప్రయాణం ఏంటీ అనేది కూడా చాలా మందికి అర్ధం కాని పరిస్థితి. తమ సొంత జిల్లాపైనే ఆమె ఫోకస్ చేస్తారనే అభిప్రాయం కూడా వినపడింది.

Also Read : కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే నాలుగు రాష్ట్రాలు..!

తమ కుటుంబంలో చీలిక, తాను బయటకు రావడానికి ప్రధాన కారణం హరీష్ రావు అని పదే పదే ఆరోపణలు చేస్తున్న కవిత.. వచ్చే ఎన్నికల్లో తన పోటీ విషయంలో ఊహించని షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు స్థానానికి గురిపెట్టిన కవిత.. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేసారు. దీనితో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. నా మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట, రెండో ప్రాధాన్యత బోధన్ అంటూ ప్రకటించారు.

Also Read : ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు..!

ఎన్నికల కమిషన్‌లో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, పార్టీ ప్రకటన మే మొదటి వారంలో చేస్తానన్నారు. అయితే కవిత సిద్ధిపేటలో పోటీ చేస్తే హరీష్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది చెప్పవచ్చు. నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు హరీష్ రావు. అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా సిద్ధిపేట దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఉన్న సమయంలో ఉపాధి, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలు, మౌలిక సదుపాయాల్లో ఆయన దూకుడు కనపడింది. మరి కవిత ఆయనను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ థార్ గొడవ...

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

పోల్స్