Wednesday, October 7, 2026 07:49 AM
Wednesday, October 7, 2026 07:49 AM

ఈ జట్టుతో కప్ కొడతారా..? భారత్ పై తీవ్ర విమర్శలు..!

టి20 వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది. పాకిస్తాన్ సహా మిగిలిన మూడు జట్లను భారత్ ఓడించింది. భారత బౌలింగ్.. బ్యాటింగ్ చాలా బలంగా కనపడుతోంది.. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్న ఫీలింగ్ ఇది. కానీ లోపాలు చూస్తుంటే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారి ఆట తీరు చూస్తే.. జింబాబ్వే బలంగా కనపడుతోంది, శ్రీలంక, వెస్టిండీస్ ఇంకా బలంగా కనపడుతున్నాయి. మిడిల్ ఆర్డర్ లో లోపాలు జట్టును మరింత కలవరపెడుతున్నాయి.

Also Read : షాకింగ్: ఇమ్రాన్ ఖాన్ కు భారత ప్రముఖుల నుంచి మద్దతు..!

స్పిన్ బౌలింగ్ లో అభిషేక్ ఫెయిల్ అవ్వడంతో ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. ఈ వీక్నెస్ ను చిన్న జట్లు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. నెథర్లాండ్స్ ఇదే వ్యూహంతో బరిలోకి దిగింది సక్సెస్ అయింది. ఇక మిడిల్ ఆర్డర్ లో కీలకంగా భావించే శివం దుబే, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఆడతారో కూడా అర్ధం కానీ పరిస్థితి.శివం దుబే పెద్ద జట్లపై ప్రభావం చూపలేని పరిస్థితి కనపడుతోంది. ఇక మిడిల్ ఆర్డర్ లో వాడుకునే ఆటగాళ్లను లోయర్ ఆర్డర్ కు మార్చేసారు.

Also Read : ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు..!

వాషింగ్టన్ సుందర్ ను నిన్న ముందు పంపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక రింకు సింగ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. దీనితో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. లీగ్ దశలో చిన్న జట్లపై భారత్ కష్టపడి గెలిచింది. నమీబియా బౌలింగ్ లో భారత మిడిల్ ఆర్డర్ ను ఓ ఆట ఆడుకుంది. లీగ్ దశలో ఇది పెద్దగా సమస్య కాకపోయినా రేపు.. సూపర్ 8 లో అడుగు పెడితే మాత్రం భారత్ కు కష్టాలు తప్పవు అంటున్నారు ఫ్యాన్స్. కీలక ఆటగాళ్లను వాడుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్