Thursday, September 17, 2026 10:46 PM
Thursday, September 17, 2026 10:46 PM

సోషల్ మీడియాలో జగన్ కామెడీ వైరల్..!

అన్నొస్తున్నాడు.. అందరికీ మంచి జరుగుతుంది.. అనేది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పిన డైలాగ్. కానీ.. దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో మరో మాదిరిగా వాడేస్తున్నారు. సాధారణంగా మీమర్స్‌కు పార్టీలతో పని ఉండదు. వాళ్లకు ఏది నచ్చితే దానిని వైరల్ చేస్తేస్తారు. అందుకే బ్రహ్మానందం డైలాగ్‌లు, నటన, నవ్వును మీమ్స్ కింద వాడేస్తున్నారు. మీమ్స్ గాడ్ అని బ్రహ్మానందం పేరు. అయితే బ్రహ్మానందం సీన్లు, డైలాగులు ఇప్పటికే వందలు, వేల సార్లు వాడేశారు. ఇప్పుడు మీమర్స్‌కు కొత్త యాక్టర్ దొరికారు. ఆయనే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Also Read : బ్రేకింగ్: సంచలన ప్రకటన చేసిన కవిత..!

రాజకీయ నాయకుల వీడియోలను మీమర్స్ చాలా తక్కువగా వాడుతారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరుల ఏమైంది రా అనే వీడియోతో పాటు.. ఓడియమ్మ బడవా అనే వీడియో బాగా వైరల్ అయ్యింది. వీటితో పాటు ఇప్పుడు జగన్ వీడియోలను కూడా ట్రోలర్స్ బాగా వాడేస్తున్నారు. ప్రెస్ మీట్‌లో జగన్ చెప్పే మాటలు, ఆయన హావభావాలు, పలకరింపులను మీమర్స్ తెగ వైరల్ చేస్తున్నారు. టైమ్ అయిపోయిందని, దూరంగా ఉండమని చెప్పడం.. ఏంది బ్రో ఇది అని.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని జగన్ మీమ్స్ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చేశాయి.

ఇక ఏపీ బడ్జెట్ లెక్కలపై జగన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నుంచి కూడా కావాల్సినన్ని డైలాగ్‌లను ట్రోలర్స్ తీసుకున్నారు. ఆ లెక్కలు చెప్పిన తర్వాత లోకేష్ పర్యటనలపై జగన్ వెరైటీ వ్యాఖ్యలు చేశారు. “లోకేశ్, నువ్వు క్రికెట్ అభిమానివే… టీవీ చూస్తే కనిపించదా?.. మేము కూడా టీవీలోనే చూశాం..” అన్నారు జగన్. ఈ డైలాగ్ పై ఇప్పుడు సోషల్ మీడియా దుమ్ము రేగిపోతోంది.

Also Read : వీకెండ్ లో యుద్దమే..? రెడీ అయిన ట్రంప్..!

ప్రపంచంలో క్రికెట్ చూడటానికి ఎంతో మంది స్టేడియానికి వెళ్లి ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్లందరికి టీవీలు లేవా..? టీవీల్లో చూడటం చేతకాక.. పని లేక స్టేడియం వస్తున్నారు కదా జగన్ అన్న..! అని ట్రోల్ చేస్తున్నారు. అరే ఏం మాట్లాడుతున్నాడు రా.. అని డైలాగ్‌లు యాడ్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఎవడ్రా స్క్రిప్ట్ రాసి ఇచ్చింది.. అసలు వాడికి బుర్ర ఉందా.. లేదా.. అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగన్ మాట్లాడే మాటలు భలే టైమింగ్ కామెడీగా ఉంటాయి. రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. చూసేవారికి, వినే వాళ్లకు బాగా ఎంటర్ టైన్ అవుతుందని ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్