Saturday, May 23, 2026 03:07 PM
Saturday, May 23, 2026 03:07 PM

వీకెండ్ లో యుద్దమే..? రెడీ అయిన ట్రంప్..!

గత నెల రోజుల నుంచి ఆసక్తి రేపుతోన్న.. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య రగడ.. ఈ వీకెండ్ లో కీలక దశకు చేరుకునే సంకేతాలు కనపడుతున్నాయి. ఇరాన్ పై దాడికి ప్రయత్నాలు చేస్తున్న అమెరికా.. ఈ వారం చివర్లో దాడి చేసేందుకు రెడీ అయింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుమతి ఇవ్వకపోయినా.. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తమ సైన్యాన్ని ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా మోహరించింది.

Also Read : తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

పాకిస్తాన్ కూడా ఈ విషయంలో అమెరికాకు సహకరిస్తోంది. ఇక యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, ఇంధనం నింపే విమానాలతో సహా మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపులకు దిగింది. సిఎన్ఎన్ కథనం ప్రకారం.. వారాంతంలో దాడి చేసేందుకు వైట్ హౌస్.. ఇప్పటికే తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే మిత్ర దేశాల అభిప్రాయం కూడా అమెరికా సర్కార్ తీసుకుందని.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని.. అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : మైండ్ గేమ్ లో బొత్స సక్సెస్ అయ్యారా..?

ఈ విషయంలో ట్రంప్.. దూకుడుగా తీసుకోలేని పరిస్థితి ఉంది. హార్మోజ్ జల సంధి సహా.. ఇరాన్ వద్ద ఉన్న బలమైన ఆయుధాలు కూడా అమెరికాను కంగారు పెడుతున్నాయి. గత సంవత్సరం ఇరాన్‌పై దాడులకు ఆదేశించిన ట్రంప్.. 2018లో తన మొదటి పదవీకాలంలో.. ట్రంప్ కు ఇరాన్ షాక్ ఇచ్చింది. అణు ఒప్పందాన్ని ఇరాన్ రద్దు చేసింది. ఇక దాని విషయంలో చర్చలు జరగకపోతే మరింత సైనిక చర్య తీసుకుంటామని ట్రంప్ పదే పదే అమెరికాను బెదిరిస్తూ వస్తున్నారు. మధ్యప్రాచ్యంలో 13 యుద్ధనౌకలను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

పోల్స్