Saturday, May 23, 2026 05:38 PM
Saturday, May 23, 2026 05:38 PM

బ్రేకింగ్: అనంతబాబు కేసులో ఏపి పోలీసుల పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో విచారణ ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హత్య ఎవరు చేసారు.. ఏంటీ అనే దానిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరూ అనేది స్పష్టత రాని పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంత్ బాబును కనీసం సస్పెండ్ చేయకపోవడంపై కూడా టీడీపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. గత రెండు రోజుల నుంచి ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read : సోషల్ మీడియాలో జగన్ కామెడీ వైరల్..!

ఈ కేసులో అనంత్ బాబుతో పాటుగా ఆయన భార్య పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. ఈ కేసుని విచారిస్తున్న అధికారులు.. ఎమ్మెల్సీ భార్య లక్షిదుర్గ పాత్ర కూడా ఉందని తేల్చింది. హత్యలో ఆమె కూడా పాల్గొన్నారు అని, ఆధారాలను నాశనం చేసారని కోర్ట్ దృష్టికి సిట్ తీసుకుని వెళ్ళింది. కేసులో ఆమెను ఏ2 గా పేర్కొంటూ.. రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసారు. 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య, మృతదేహాన్ని తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అప్పగించిన సంగతి తెలిసిందే.

Also Read : పయ్యావుల విశ్వరూపం.. హాట్ హాట్ గా మండలి..!

సి సి ఫుటేజ్ లు, కాల్ రికార్డులు సహా పలు సాంకేతిక ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇక తాజాగా ఈ కేసులో సుప్రీం కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ సకాలంలో పూర్తి చేయకపోవడంపై రాష్ట్ర పోలీసులపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును వీలైనంత వేగంగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్ 18లోగా అభియోగాల నమోదు పూర్తి చేయాలని, అదే విధంగా సాక్షుల విచారణ, ఇతర అంశాలు ఆగస్టు 31లోగా పూర్తిచేయాలని, నవంబర్ 30 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ కాదు… ఇది...

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర...

బెజవాడ థార్ గొడవ...

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

పోల్స్