Sunday, March 22, 2026 07:28 AM
Sunday, March 22, 2026 07:28 AM

గ్రేడ్ మార్పులు.. కోహ్లీ.. రోహిత్ కు షాక్ తప్పదా..?

దాదాపు రెండు దశాబ్దాల నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలరిస్తూనే ఉన్నారు. ఏ జట్టు మీద అయినా సరే సెంచరీలు బాదుతూ టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే గత ఏడాదికాలంగా క్రమంగా వీళ్ళిద్దరూ క్రికెట్ కు దూరం అవుతున్నారు అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. 2024 టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. భారత జట్టు నుంచి క్రమంగా వీళ్ళిద్దరూ తప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు t20 లకు వీళ్ళిద్దరూ దూరమైనప్పటికీ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. టెస్ట్ క్రికెట్ తో పాటుగా వన్డే క్రికెట్ కూడా ఆడతారని ఆశ పెట్టుకున్నారు.

Also Read : ఎంపీలకు లోకేష్ క్లాస్.. పార్లమెంట్ కు వెళ్లాల్సిందే

చివరకు గత ఏడాది టెస్ట్ క్రికెట్ కు కూడా ఇద్దరూ దూరమయ్యారు. ఇక అప్పటినుంచి వన్డేల మీద ఫోకస్ పెట్టిన ఇద్దరు ఆటగాళ్లు.. ఆస్ట్రేలియాపై, సౌత్ ఆఫ్రికాపై విశ్వరూపం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు క్రమంగా వీళ్ళకు బోర్డు కూడా షాక్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు ఉండవచ్చని ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇద్దరు ఏ ప్లస్ కేటగిరీలో ఉండగా ఇటీవల కాలంలో ఏ కేటగిరీలోకి మారుస్తారని వార్తలు వచ్చాయి. అంటే వీళ్ళిద్దరి వార్షిక వేతనం ఏడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు పడిపోతుందని జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : తమిళం నేర్చుకుంటున్న పవన్.. బిగ్ ప్లాన్ తో పొలిటికల్ స్టెప్స్

అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి గ్రేడ్ లో కీలక మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉండవచ్చని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్లస్ నుంచి ఏకంగా బి కేటగిరీలోకి వీళ్ళిద్దరిని మార్చే అవకాశాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దీనిని బోర్డులోని కొందరు సభ్యులు వ్యతిరేకిస్తున్నారని.. వీళ్ళిద్దరి కారణంగా వన్డేలకు మళ్లీ ఆదరణ పెరిగిందని.. దానికి తోడు వాళ్లు ఆడుతున్న మ్యాచ్లకు టీవీల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉందని, భారత జట్టు బ్రాండ్ వేల్యూ ఏమాత్రం పడిపోలేదని.. కాబట్టి ఇద్దరినీ ఏ ప్లస్ కేటగిరీలో నేను కొనసాగించాలని బోర్డులోని కొందరికి సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం బోర్డు ఆలోచిస్తుందని.. ఇన్నేళ్లపాటు భారత క్రికెట్ కు సేవలు అందించిన ఇద్దరికీ అదే అవమానకరంగా ఉంటుందని వాదిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్