Wednesday, May 6, 2026 08:00 PM
Wednesday, May 6, 2026 08:00 PM

ఏపీ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం తుఫాన్..?

కొన్నాళ్లుగా పరిపాలన మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ సచివాలయంలో పెద్ద చర్చ జరుగుతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు, సచివాలయానికి పెద్దగా రారు అనే కామెంట్ వినపడుతూ ఉంటుంది. కలెక్టర్ల సమావేశం తో పాటు ఇతర సమీక్ష సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటారనే మాట ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఎక్కువగా వినపడేది. ఇప్పుడు వీటికి చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.

Also Read : మెగాస్టార్ విశ్వంభర అసలు వస్తుందా..?

ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడుగా ఉండటం.. దీనిపై మంత్రులకు పదేపదే సూచనలు చేస్తున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ మంత్రులకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు కనీసం సచివాలయంలో ఉండాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఇకనుంచి.. తన పేషీలో జరిగే కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శించడం, కీలక ఫైల్స్ వెనకబడిపోవడంతో పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఫైలింగ్ విషయంలో కూడా అధికారులకు అవగాహన లేదనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలాగే తన పేషీకీ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే అంశాలను కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ శాఖ విషయంలో వైసిపి కొంత ఫోకస్ పెట్టింది అనే ప్రచారం జరుగుతుంది. అధికారులు వైసీపీ నేతల కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ఫైల్స్ ముందుకు వెళ్లకపోవడంతో ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. పదే పదే తన శాఖ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న సరే పనులు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Also Read : తమిళం నేర్చుకుంటున్న పవన్.. బిగ్ ప్లాన్ తో పొలిటికల్ స్టెప్స్

అందుకే ఇప్పుడు పవన్ నేరుగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టు పెంచుకుంటే.. భవిష్యత్తులో తనకు ఉపయోగకరంగా ఉంటుందని.. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి.. రాజకీయాలు చేస్తూనే పరిపాలనపై దూకుడు పెంచాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు.. శాఖపై కూడా అదేవిధంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటనలో కూడా అధికారుల తీరిపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్