Wednesday, May 6, 2026 08:00 PM
Wednesday, May 6, 2026 08:00 PM

టీడీపీ కార్యకర్తలపై కేసుల సంగతి ఏంటి..?

2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేసి కోర్ట్ ల చుట్టూ తిప్పిన పరిస్థితులు అప్పట్లో చూసాం. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ఎందరో కార్యకర్తలపై ఈ విధంగా కేసులు నమోదు చేశారు అప్పటి అధికార పార్టీ నేతలు. సోషల్ మీడియాలో వైసీపీ విమర్శించిన ఎందరికో ఈ పరిస్థితి ఎదురైంది. ఇక టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలపై కేసులు ఎత్తేస్తారని చాలామంది ఎదురు చూశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రౌడీషీట్ లు ఓపెన్ చేయించుకున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు.

Also Read : పాపం ఎమ్మెల్యే.. కొత్త నేత దెబ్బకు ఉక్కిరిబిక్కిరి

కానీ ఇప్పుడు టిడిపి కార్యకర్తలపై నమోదైన కేసులు కొట్టివేయడం గాని.. వారిపై ఓపెన్ అయిన రౌడీషీట్ కొట్టివేయడం గాని జరగడం లేదు. స్థానిక వైసీపీ నాయకుల ఆదేశాలతో కేసులు నమోదు చేశారు అప్పట్లో పోలీసులు. దీనిపై టిడిపి ఎమ్మెల్యేలను, నాయకులను, మంత్రులను కలుస్తున్న సరే కార్యకర్తలపై ఉన్న కేసులు మాత్రం కొట్టి వేయడం లేదు అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా సహా పలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది అనే మాట వినపడుతోంది. చాలామంది కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. అప్పట్లో బలమైన సెక్షన్లు పెట్టడంతో శిక్ష పడుతుంది ఏమో అనే భయం కూడా కార్యకర్తల్లో ఉంది.

Also Read : మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో నందమూరి వారసుడు

దీంతో తమపై ఉన్న కేసులు కొట్టివేయాలంటూ ఎన్ని గడపలు తొక్కుతున్న సరే ఉపయోగం లేకుండా పోయింది. దీనితో చాలామంది కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. 2024 ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు వచ్చి పని చేసిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పట్లో పోలీసులు సొంత ప్రాంతంలో ఉండకూడదని ఆదేశాలు ఇవ్వటంతో చాలామంది తెలంగాణలో లేదంటే కర్ణాటకలో, తమిళనాడులో ఉన్న పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మాత్రం సొంత ప్రాంతంలో ఉంటున్నప్పటికీ ప్రతినెలా తాము వాయిదాలకు తిరగాల్సి వస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్