Wednesday, August 5, 2026 06:33 AM
Wednesday, August 5, 2026 06:33 AM

మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో నందమూరి వారసుడు

నందమూరి వారసుడు మోక్షజ్ఞతేజ సినిమా ఎంట్రీ కి సంబంధించి ఏడాది నుంచి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ఇప్పటివరకు ముందుకు పడలేదు. ఒక పోస్టర్ రిలీజ్ చేయడం మినహా తర్వాత వచ్చిన ఏ ఒక్క రూమర్ కు రెస్పాండ్ అవలేదు సినిమా యూనిట్. దీనితో నందమూరి ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతోంది. ఇతర హీరోల వారసులు సినిమాల మీద సినిమాలు చేస్తుంటే మోక్షజ్ఞ ఇంకా ఎందుకు ముందుకు రావడం లేదంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Also Read : మెగాస్టార్ విశ్వంభర అసలు వస్తుందా..?

అయితే ఇప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా మొదలుపెట్టే ఛాన్స్ కనబడుతోంది. ఒక యంగ్ హీరో కోసం రాసిన కథను మోక్షజ్ఞ కోసం వాడుకోవాలని త్రివిక్రమ్ వర్కౌట్ స్టార్ట్ చేసినట్లు టాక్. సినిమా కోసం మోక్షజ్ఞ మేకోవర్ చేసుకున్నప్పటికీ.. ఎంట్రీ మాత్రం అంత ఈజీగా లేదని చెప్పాలి. అయితే రీసెంట్ టాక్స్ ప్రకారం మోక్షజ్ఞకు త్రివిక్రమ్ రాసిన కథ బాలయ్యకు నచ్చినట్లు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. పూరి జగన్నాథ్ కూడా ఒక కథను రెడీ చేశారని కాకపోతే ఆ కథ మోక్షజ్ఞకు సెట్ కాకపోవచ్చు అనే భయం బాలయ్యలో ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Also Read : లోకేష్ పై క్లాస్, మాస్ ముద్రలు..!

సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మించే అవకాశం కనబడుతోంది. దీనితోపాటు అనిల్ రావిపూడి కూడా ఓ స్టోరీ చెప్పాడని.. కాకపోతే ఆ సినిమా లేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ముందుగా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే సినిమాలో స్టార్ట్ చేయవచ్చని తెలుస్తోంది. దీనితోపాటుగా మరో రెండు మూడు కథలు కూడా విన్నప్పటికీ.. ఆ డైరెక్టర్లు బిజీగా ఉండటంతో.. త్రివిక్రమ్ ఖాళీగా ఉండటంతో ఇప్పటికే సినిమాకు సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తో సైతం మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ.. అది కూడా లేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ సినిమానో లైన్లో పెట్టేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్