Wednesday, May 6, 2026 11:50 PM
Wednesday, May 6, 2026 11:50 PM

ఏపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పవన్ అత్యవసర సమావేశం..!

ఏపీలో ఆసక్తికర పరిణామాల దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. గత వారం రోజుల నుంచి ఏదో జరుగుతోంది అనే సంకేతాలు ఏపీ రాజకీయ వర్గాల్లో కనపడుతున్నాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు ఆయన. ఆయన భేటీలో ఏం జరిగింది ఏంటీ అనే దానిపై అటు వైసీపీ వర్గాలు సైతం ఆరా తీసాయి. లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతీసారి ఏదోక కేసులో కదలిక కనపడుతోందనే మాట వినపడుతోంది.

Also Read : బ్రేకింగ్: టి20 కెప్టెన్ మార్పు..?

ఆ తర్వాత ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. వాళ్ళు ఇద్దరికీ హోం మంత్రి అమిత్ షా నుంచి ఆహ్వానం రావడంతో హడావుడిగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ పర్యటనలో ఏం జరిగింది ఏంటీ అనేది కూడా ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. కలెక్టర్ ల సమావేశం తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోయారు. కీలక కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు.. ఎన్డియే ఎంపీలతో ఓ కీలక సమావేశం నిర్వహించారు.

Also Read : పది నిమిషాలు నడిస్తే డైట్ అవసరం లేదా..?

రాష్ట్రంలో బాధ్యతగా ఉండాలంటూ సూచించారు. ఆ తర్వాత ఏపీలో ఉన్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా ఒక్క రోజే పవన్ 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయి.. రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై ఆయన చర్చించారు. దీనితో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు వస్తున్నాయి. అటు జగన్ కూడా గవర్నర్ ను కలిసారు. మరి ఏ పరిణామాలు ఉంటాయో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్