Wednesday, August 5, 2026 06:36 PM
Wednesday, August 5, 2026 06:36 PM

బ్రేకింగ్: టి20 కెప్టెన్ మార్పు..?

భారత టి20 జట్టులో మార్పులకు రంగం సిద్దమైందా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. గత కొన్నాళ్ళుగా సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతను రాణించలేదు. దీనితో అతనిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వినపడుతోంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతోన్న సీరీస్ లో కూడా అతను రాణించలేదు. ఓ వైపు యువ ఆటగాళ్ళు పోటీ పడుతున్న సమయంలో.. సూర్య కుమార్ యాదవ్ దారుణంగా ఆడటంపై విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

Also Read : పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!

అటు వైస్ కెప్టెన్ గా జట్టులో చేరిన శుభమన్ గిల్ పరిస్థితి ఇంత కంటే దారుణంగా ఉంది. సూర్య కుమార్ యాదవ్ తర్వాత గిల్.. భవిష్యత్తు నాయకుడు అని అందరూ భావించినప్పటికీ.. సీన్ రివర్స్ లో కనపడుతోంది. దీనితో 5వ టి20లో కూడా అతనిని పక్కన పెట్టి.. సంజు సామ్సన్ కు అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో కెప్టెన్ మార్పు వ్యవహారం చర్చకు వస్తోంది. టి20 కెప్టెన్ గా.. అభిషేక్ శర్మ లేదంటే హార్దిక్ పాండ్యా పేర్లు వినపడుతున్నాయి. ఈ ఇద్దరూ జట్టులో కీలక ఆటగాళ్ళు.

Also Read : కూటమిలో ఆ ఇద్దరి వల్లే చిచ్చు..!

ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో హార్దిక్ ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కాబట్టి.. హార్దిక్ ను కెప్టెన్ చేయాలనే డిమాండ్ బలంగా వినపడుతోంది. ఇప్పటి వరకు సూర్య కుమార్ ను సపోర్ట్ చేసిన యాజమాన్యం కూడా.. ఇక పక్కన పెట్టే ఆలోచనలోనే ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. అటు యశస్వి జైస్వాల్ ను టి20 జట్టుకు న్యూజిలాండ్ తో సీరీస్ కోసం ఎంపిక చేసే అవకాశం సైతం కనపడుతోంది. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్