Sunday, September 20, 2026 02:29 AM
Sunday, September 20, 2026 02:29 AM

అవార్డ్ క్రెడిట్ వాళ్ళదే.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే.. ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డ్ ను దక్కించుకున్న తొలి రాజకీయ నాయకుడు కావడంతో టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్ లో జరుగుతోన్న కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో.. మంత్రులు, కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులు సిఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

Also Read : పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!

స్టాండింగ్ ఓవేషన్ ద్వారా చంద్రబాబును అభినందించారు. అటు సోషల్ మీడియాలో సైతం పలువురు ప్రముఖులు చంద్రబాబును అభినందించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదు అన్నారు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదే అంటూ అభినందించారు.

Also Read : కూటమిలో ఆ ఇద్దరి వల్లే చిచ్చు..!

గత ప్రభుత్వంలో ధ్వoసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామన్నారు. గతంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విషయంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతీ ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పూర్తి కాగా ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు శాంతి భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష అనంతరం సిఎం.. ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్