Wednesday, August 5, 2026 07:25 PM
Wednesday, August 5, 2026 07:25 PM

కలెక్టర్ కు ఫిదా అయిపోయిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆరు జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్ లు ప్రజెంటేషన్ ఇచ్చారు. అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పై చర్చ జరిగింది. స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాల అమలు పై కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ పని తీరుకు సిఎం చంద్రబాబు ఫిదా అయిపోయారు.

Also Read : చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లాలో ‘ఛాంపియన్ రైతు’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ హిమాన్షు శుక్లాను సిఎం అభినందించారు. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ‘ఛాంపియన్ రైతు’ కార్యక్రమం తీసుకున్నామని హిమాన్షు శుక్లా వివరించారు. ప్రతీ గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్ ను ఎంపిక చేసి మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం, యాంత్రీకరణ పెంచటం, ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించటం, పంటల విలువ జోడింపు లాంటి ప్రక్రియలు చేపట్టామని కలెక్టర్ వివరించారు.

Also Read : సీబీఐకి వైసీపీ లవ్‌ లెటర్స్‌.. బాబాయ్‌ గొడ్డలి కేసులో తప్ప

కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చూస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా.. తెలపగా.. సిఎం చంద్రబాబు సహా మంత్రులు అందరూ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం.. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షూ శుక్లాను అభినందిస్తున్నాను.. అమరావతిలోనే ఉండమని హిమాన్షును కోరానని తెలిపారు. కానీ ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టరుగా వెళ్లారు.. చక్కగా పనిచేస్తున్నారని కొనియాడారు. రైతు సేవా కేంద్రం, స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించే ఇలాంటి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్