Sunday, September 20, 2026 03:17 AM
Sunday, September 20, 2026 03:17 AM

కూటమిలో ఆ ఇద్దరి వల్లే చిచ్చు..!

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం సజావుగా పరిపాలన సాగిస్తోంది. మరో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతుందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు కూడా. ఓ వైపు ప్రభుత్వం సజావుగా సాగుతుంటే.. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారా.. ఆ కుట్రకు మూలం ఎక్కడ.. అసలు కుట్ర చేయాల్సిన అవసరం ఏమిటీ.. ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి ప్రతి సభలో, బహిరంగ వేదికపైన, అధికార సమావేశంలో కూడా పవన్ పనితీరుపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ.. కొందరు వైసీపీ అభిమాన ఐఏఎస్‌లు మాత్రం ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది.

Also Read : సునీల్ లాజిక్.. జగన్‌కు కౌంటర్..!

ఏపీలో సీఎం, డిప్యూటీ సిఎం మధ్య, అధికార చిచ్చు పెట్టేందుకు, వైసీపీ అభిమాన ఐఏఎస్‌లు ఒకటయ్యారా..??వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక వెలుగు వెలిగిన, జగన్ రెడ్డి అభిమాన అధికారులుగా ముద్ర వున్న ఇద్దరు ఐఏఎస్ లే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పధకం ప్రకారం అధికార చిచ్చు పెట్టారని ఏపీ సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులలో ఒకరు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాధిపతి శశిభూషణ్ కుమార్ కాగా, మరొకరు సీఎంవో అధికారి ప్రద్యుమ్న అని ప్రచారం జరుగుతోంది కూడా. ఈ ఇద్దరు వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌తో, నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చాలా సన్నిహితంగా మెలిగే వారు. ఈ ఇద్దరూ అప్పటి నుండే సన్నిహితులు కూడా.

వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అదనపు బాధ్యతలు శశిభూషణ్ కుమార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక ప్రధ్యుమ్న ఏపీ సీఎంవోలో నియమితులయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడైన శశిభూషణ్ కుమార్‌ను కూడా అదే శాఖలో పూర్తిగా కొనసాగేటట్లు చేశారనేది సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాటి నుండి దోస్త్ మేరా దోస్త్ బంధం మళ్ళీ కొనసాగింది.

Also Read : బ్రేకింగ్: వివేకా కేసులో జగన్ నిర్దోషి..?

ఇక అసలు విషయం ఏమిటంటే.. మేమిద్దరం మరో 15 ఏళ్లు కలిసే ఉంటాం.. మరో 15 ఏళ్లు కూటమి సర్కార్ అధికారంలోనే ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఈ మాటే వైసీపీ అభిమాన అధికారులుగా ముద్ర పడిన ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులకు మింగుడు పడలేదనే మాట వినిపిస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పధకం ప్రకారం చిచ్చు పెడుతున్నారనేందుకు కొన్ని సంఘటనలే ఉదాహరణ. అందులో ఒకటి ఈఈ గా పనిచేస్తున్న వారికి ఎస్ఈ గా ప్రమోషన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈఈ నుండి ఎస్ఈ గా ప్రమోషన్ ఇవ్వాలంటే.. ఈఈ గా తప్పనిసరిగా రెండేళ్లు పని చేయాల్సిందే. కానీ అంత సర్వీస్ పూర్తి కానీ నేపథ్యంలో.. రెండేళ్ల సర్వీసును సడలించి ప్రమోషన్ ఇవ్వాలంటే సీఎం అనుమతి తీసుకోవాలనే నిభందన ఉంది.

అందుకు తగ్గట్లుగా ప్రమోషన్ సంబంధించిన పైలును సీఎం చంద్రబాబు ఆఫీసుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి పంపారు. ఆ విధంగా పంపటం ఇష్టం లేని శాఖాధిపతి శశిభూషణ్.. తనకు సన్నిహితుడైన సీఎంవో అధికారి ప్రద్యుమ్న ద్వారా కొర్రీ వేయించారనే మాట బాగా వినిపిస్తంది. ఆ కొర్రీ ఏ విధంగా ఉందంటే.. ప్రమోషన్‌ల కోసం సర్వీస్ మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిని ఇన్‌చార్జి ఎస్ఈ గా నియమిస్తే చాలు అని ఆ ఫైల్ లో రాశారంట. కానీ ఆ పద్ధతి ఇష్టపడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆ పైల్‌ను సీఎం చంద్రబాబు పేషీకి పంపించినట్లు తెలుస్తోంది. మరోసారి కూడా ప్రద్యుమ్న మరో కొర్రీ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read : సీబీఐకి వైసీపీ లవ్‌ లెటర్స్‌.. బాబాయ్‌ గొడ్డలి కేసులో తప్ప

ప్రతిఫలం ఆశించకుండా, ప్రమోషన్‌లు ఇవ్వాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా ఉంటే, మరేదో ఆశించి ఆ పైల్‌ను ఆమోదించకుండా.. తన సన్నిహితుడైన సీఎంవో అధికారి ప్రద్యుమ్న ద్వారా పధకం ప్రకారం శశిభూషణ్ కుమార్ అడ్డుపడుతున్నారని ఆ శాఖలో కథలు, కథలుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం.. ఈ ఇద్దరు అధికారులకు ఇష్టం లేదేమో అని.. జగన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చూడాలని వారిద్దరు గట్టుగా కోరుకుంటున్నారేమో అనే అనుమానం చాలామందిలో ఉంది. మరి ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్