Sunday, March 22, 2026 12:51 PM
Sunday, March 22, 2026 12:51 PM

కోటంరెడ్డి సంచలనం.. వారి బాధ్యత నా కూతుళ్ళదే..!

నెల్లూరులో కమ్యూనిస్ట్ నాయకుడు పెంచలయ్య మరణం వ్యవహారం అత్యంత సంచలనం అవుతోన్న వ్యవహారం చూస్తున్నాం. గంజాయి బ్యాచ్ కు ఎదురు తిరిగాడు అనే కారణంతో.. పెంచలయ్యను దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. దీని వెనుక మాస్టర్ మైండ్.. కామాక్షిని కూడా అరెస్ట్ చేసారు.

Also Read : పుతిన్ ఫస్ట్ ట్రంప్ నెక్స్ట్.. రష్యాతో భారత్ కీలక ఒప్పందం..?

గంజాయి వ్యాపారాన్ని ఆమెనే దగ్గర ఉండి నిర్వహిస్తోంది అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో స్థానికులు ఆమె ఇళ్ళను కూడా కూల్చివేయడం చూసాం. ఇదిలా ఉంచితే.. పెంచలయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వంతో పాటుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు తాజాగా ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కలిసారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసారు ఎమ్మెల్యే. గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబసభ్యులకు తాను అండగా ఉంటాను అన్నారు.

Also Read : వినసొంపుగా స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్.. ఈ సంక్రాంతికి..!

పెంచలయ్య కుటుంబానికి రూ.10 లక్షలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అందించారు. కుమారుల్లో ఒకరిని ఐఏఎస్‌, మరొకరిని ఐపీఎస్‌ చేయించాలనేది పెంచలయ్య కోరిక అని.. పెంచలయ్య కుమారుల బాధ్యత నా కుమార్తెలు, అల్లుళ్లు తీసుకుంటారు అని ప్రకటించారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసుకుంటా అని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి పెంచలయ్య విగ్రహాన్ని ఆర్డీటీ కాలనీలో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్