Sunday, September 20, 2026 02:28 AM
Sunday, September 20, 2026 02:28 AM

రూపాయి జీతంతో వందల కోట్లు ప్రజల సొమ్ము వాడేసిన జగనన్న..!

2019 లో.. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజులు గుర్తున్నాయా..? అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినప్పుడు ఓ దృశ్యం అందరికి కనపడేది. 20 రూపాయల వాటర్ బాటిల్ ప్రతీ ఫోటోలో కామన్ గా ఉండేది. అలాగే రూపాయి జీతం తీసుకుంటున్న జగన్ అంటూ వైసీపీ అనుకూల మీడియాలో ఓ రేంజ్ ప్రచారం కూడా.. ఎన్టీఆర్ తో పోలుస్తూ నడిచేది. వృధా ఖర్చులు తగ్గించాలి అంటూ.. జగన్ ఎమ్మెల్యేలకు పదే పదే చెప్పే వారు.. ప్రభుత్వ సొమ్ము ప్రసాదంలా చూడాలంటూ చెప్పేవారు.

Also Read : కుహానా మేధావుల కొత్త ఆట : టార్గెట్ చంద్రబాబు..!

కానీ.. కానీ.. ఆచరణలో అన్న మాత్రం ప్రభుత్వ సొమ్మును నీళ్ళ కంటే ఎక్కువ వాడారు అనేది చాలా మందికి తెలియని వాస్తవం. లోకేష్ చిరు తిండికి పాతిక లచ్చలు అయిందంటూ వైసీపీ నిజం కాని, నెగటివ్ ప్రచారం ఓ రేంజ్ లో చేసింది. కానీ అన్న చేసిన వృధా ఖర్చులు మాత్రం పూడ్చిపెట్టింది. ఐదేళ్ల పాలనలో జగన్ తిరుగుళ్లకు అక్షరాలా అయిన ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. 60 రూపాయల హిమాలయ బాటిల్స్ వాడకం మానేసి డబ్బులు తాగేశారు పర్యటనల పేరుతో అనే నిజం ఇప్పుడు బయటకు వచ్చింది.

Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన యాపిల్..!

222 కోట్ల 85 లక్షల 25 వేల 893 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి జగన్ ఉపయోగం లేని తిరుగుళ్ళకు చెల్లించారు. ఆ తిరుగుళ్ళ కారణంగా రూపాయి పెట్టుబడి రాలేదట. ప్రజలకు కలిగిన మేలు కూడా లేదట. ఎక్కడికి వెళ్ళినా చార్టెడ్ ఫ్లైట్స్ లో వెళ్ళేవారు జగన్. భద్రత పేరుతో భారీగా పోలీసు సిబ్బందిని, వ్యక్తిగత సిబ్బందిని వినియోగించుకోవడం.. వాళ్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడం, వారి తిండి ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లించడం వంటివి చేసారు. 60రూపాయల వాటర్ బాటిల్ ఖర్చుల గురించి ఊదరగొట్టిన వైసీపీ.. మరి దీని గురించి ఏం మాట్లాడుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్