Wednesday, May 6, 2026 08:59 PM
Wednesday, May 6, 2026 08:59 PM

కేంద్రానికి షాక్ ఇచ్చిన యాపిల్..!

సంచార సాథి యాప్ విషయంలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయాలని.. మొబైల్ తయారీ కంపెనీలకు ఆదేశాలు వెళ్ళిన నేపధ్యంలో.. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. దీనితో కేంద్రం కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టే కనపడుతోంది. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి.. జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ యాప్ యూజర్ల ఇష్టమని.. యాక్టివేట్ చేయాలనే నిబంధన లేదని స్పష్టం చేసారు.

Also Read : సంచార్ సాథీ ఓ పెగాసస్..? కేంద్రంపై తీవ్ర విమర్శలు..!

యూజర్లు యాక్టివేట్ చేస్తేనే అది పని చేస్తుందని లేకపోతే, పని చేయదని, నిఘాకు అవకాశమే లేదని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రముఖ మొబైల్ తయారి సంస్థ ఆపిల్ కేంద్రానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఆపిల్ తన స్మార్ట్‌ఫోన్‌ లలో ప్రభుత్వ యాజమాన్యంలోని సైబర్ భద్రతా యాప్‌ ను ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలను పాటించే అంశంలో వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. యూజర్ల డేటా సెక్యూరిటీ విషయంలో.. కఠినంగా వ్యవహరిస్తోన్న యాపిల్.. ఈ విషయంలో మాత్రం వెనక్కు తగ్గే ఆలోచనలో లేదు.

Also Read : షాకింగ్: పాక్ విషయంలో భారత్ వెనక్కు తగ్గిందా..?

ప్రపంచంలో ఏ దేశం ఈ రూల్ తీసుకు వచ్చినా సరే తాము పాటించేది లేదని యాపిల్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ యాప్ ను ఆపిల్ డబుల్ బ్యారెల్ గన్ లా భావిస్తున్నట్టు అమెరికన్ మీడియా వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము కోర్ట్ కు వెళ్లకపోయినా.. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తాము ఆదేశాలను అమలు చేయలేమని ఆపిల్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అటు సామ్సంగ్ కూడా ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్