Friday, August 21, 2026 01:42 AM
Friday, August 21, 2026 01:42 AM

రోజాకు బై బై చెప్పిన జగన్..!

నగిరి నియోజకవర్గంలో కీలక పరిణామాల దిశగా రాజకీయం మారుతుంది. ముఖ్యంగా వైసీపీలో రాజకీయం ఆసక్తిని రేపుతుంది. నగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె వరుసగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలయ్యారు. ఇక అక్కడి నుంచి ఆమెకు కష్టాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా చిత్తూరు జిల్లా నాయకత్వం ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజాను మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేశారు.

Also Read : ఫాంలోకి వచ్చిన కెప్టెన్.. మరి మాజీ కెప్టెన్..?

అధిష్టానం వద్ద రోజా దీనిపై ఫిర్యాదు చేసినా సరే.. ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రోజాకు నియోజకవర్గంలో చెక్ పెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. నగిరి నియోజకవర్గంలో గాలి జగదీష్ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల వైయస్ జగన్ తో భేటీ అయిన గాలి జగదీష్.. పార్టీలోకి వచ్చే విషయంలో సానుకూలంగా ఉండటంతో అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గంలో గాలి జగదీష్ కు సీట్ ఇవ్వడానికి జగన్ కూడా సిద్ధంగానే ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

నియోజకవర్గంలో ఆయన సోదరుడు గాలి భాను ప్రకాష్.. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లో తన అన్న కంటే కాస్త గాలి జగదీష్ సీనియర్. అటు తన తండ్రికి కూడా చిత్తూరు జిల్లాలో మంచి పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని గాలి జగదీష్ భావించినా గాలి భాను ప్రకాష్ కు అధిష్టానంతో సైలెంట్ గా సీటు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read :రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయినా సరే గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకురావడానికి జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో గాలి జగదీష్ వస్తే కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక జగదీష్ వస్తే నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో అంతర్గతంగా అసహనం.....

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు...

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే...

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

పోల్స్