Saturday, September 19, 2026 01:46 PM
Saturday, September 19, 2026 01:46 PM

రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకుల్లో.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఒకరు. మీడియా ముందు చెలరేగిపోవడం, ఎదిరించిన వారిని ఇబ్బందులు పెట్టడం, సొంత పార్టీ నాయకులకు కూడా చుక్కలు చూపించడం వంటివి చేసారు తోపదుర్తి. ఇక వైసీపీ ఓడిపోయినా సరే ఆయన వైఖరిలో మార్పు రాలేదు. ఇటీవల ప్రశ్నించాడు అనే కారణంతో ఓ యువకుడ్ని మాయం చేసారనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఇక ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

Also Read : ఎన్టీఆర్ ను వాడుకోవడానికి రెడీ అయిన దేవరకొండ

రాప్తాడు వైసీపీలో కల్లోలం రేగింది. ప్రకాష్ రెడ్డి వ్యతిరేకంగా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇటీవల కొంతమందిని సస్పెండ్ చేయించారు ప్రకాశ్ రెడ్డి. దీంతో ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవాళ మరికొంతమంది రాజీనామాలు చేసే అవకాశం ఉంది. స్వచ్ఛందంగా వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. రామగిరి మండల వైసీపీ నేతలు వరుసగా రాజీనామాలకు సిద్దమయ్యారు. రామగిరి మండలం కుంటీమద్ది గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచ్ కప్పల సాయిలీల, రామగిరి జెడ్పిటిసి గోసే నాగార్జున, వైస్ సర్పంచ్ శిరీష తో పాటు 30 కుటుంబాలు వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి.

Also Read : “కల్తీ లడ్డు” కథ నడిపింది ప్రకాశం జిల్లా నేతే..?

ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన వైసీపీ నేతలు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాకు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొంతమంది బి టీం నన్ను ఓడించారు అని కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ బాధించడంతో పార్టీకి దూరంగా ఉంటామంటూ పలువురు రాజీనామాస్త్రం ప్రయోగించారు. ఇక ప్రకాష్ రెడ్డి తో డి అంటే డి అంటున్న వ్యతిరేక వర్గం.. అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది. ముందు రోజుల్లో మరిన్ని రాజీనామాలు ఉంటాయి అని వ్యతిరేకవర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్