ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం బలోపేతంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కొత్త నాయకులను రంగంలోకి తీసుకువచ్చేందుకు.. సీనియర్ నేతలు దూకుడుగా వ్యవహరించాలని కూడా ఆదేశిస్తున్నారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలు సన్నద్ధం అవుతోంది. అందుకే అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం బలపడాలని తాడేపల్లి పెద్దలు ఆదేశాలిస్తున్నారు. సీనియర్లు యాక్టివ్‌గా ఉంటాలని సూచిస్తున్నారు కూడా. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుంది. అలాంటి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా టాప్ ప్లేస్‌లో ఉంది.
Also Read : టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన టీటీడీ..!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో కూడా ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక 2024 ఎన్నికల్లో మొత్తం పది నియోజకవర్గాలను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి ఈశ్వర్రావు గెలవగా.. పాలకొండలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ విజయం సాధించారు. మిగిలిన 8 నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ కూడా టీడీపీ ఖాతాలో చేరాయి. దీంతో ఈ జిల్లాలో వైసీపీ ఒక్కసారిగా బలహీనమైంది. ధర్మాన, తమ్మినేని, సీదిరి, దువ్వాడ వంటి సీనియర్లు ఉన్నా కూడా కనీసం ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు.
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న వైసీపీ పెద్దలకు సిక్కోలు నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. కుటుంబ వ్యవహారాలను సాకుగా చూపించిన వైసీపీ పెద్దలు.. ముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దువ్వాడకు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు మధ్య ఆధిపత్య పోరు సవాళ్ల వరకు చేరుకుంది. ఇక టెక్కలికి కొత్తగా పేరాడ తిలక్‌ను ఇంఛార్జ్‌గా నియమించడంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు కొడుకు చేసిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజకీయ రచ్చకు కారణమైంది. కొడుకును కాపాడుకునేందుకు మరో యువకుడిని బినామీగా పంపారు సీదిరి. అయితే సీసీ టీవీ ఫుటేజ్‌లలో అసలు విషయం బయటకు రావడంతో.. అప్పల్రాజు కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలను తారు మారు చేసే ప్రయత్నం చేసినందుకు అప్పల్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న అప్పల్రాజు పరారయ్యాడు. దీంతో పలాసలో వైసీపీ నడిపించే నేత లేకుండా పోయారు.
Also Read : రాజీ కోసం జగన్ ప్రయత్నాలు..!
ఆ వివాదం జరుగుతుండగానే.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ కబ్జా వ్యవహారం సంచలనంగా మారింది. రూ.4 కోట్ల విలువైన భూమిని ఫేక్ డ్యాక్యుమెంట్ల ద్వారా కొడుకు చిరంజీవి నాగ్ పేరు మీదకు బదలాయించారనేది తమ్మినేనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. తమ్మినేని అరెస్టు ఖాయమని అంతా భావిస్తుండగా.. ఆయన మాత్రం మరో అద్దె వాహనంలో సైలెంట్‌గా కుటుంబంతో సహా పారిపోయారు. దీంతో ఆమదాలవలసలో తమ్మినేని పేరు ఎత్తేందుకు కూడా వైసీపీ నేతలు భయపడుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో మాజీ మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడా అని సొంత పార్టీ నేతలే వైసీపీ పెద్దలను నిలదీస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా….

