Wednesday, July 8, 2026 08:08 AM
Wednesday, July 8, 2026 08:08 AM

జూన్ 11న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పండుగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు గతంలో కంటే ఇప్పుడు క్రేజ్ పీక్స్ లో ఉంది. లేటెస్ట్ గా అతని పుట్టినరోజు నాడు ఆయన అభిమానులకు డ్రాగన్ సినిమా నుంచి ఏకంగా నాలుగున్నర నిమిషాల భారీ గ్లింప్స్ వచ్చి ఫుల్ ఖుషీ చేసింది. ఈ సినిమా మినహా మరే ఇతర చిత్రాల అప్‌ డేట్స్ రాలేదు. దీంతో నందమూరి అభిమానుల్లో పలు అనుమానాలు రేకెత్తాయి. ముఖ్యంగా దేవర 2 అప్‌ డేట్‌ ను దర్శకుడు కొరటాల శివ ఎందుకు ఇవ్వలేదు..? అసలు దేవర సీక్వెల్ ఉందా లేదా..? ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టేశాడా..? అనే పాత సందేహాలు మళ్లీ మొదలయ్యాయి.

Also Read : చంద్రబాబుకు తల నొప్పిగా గుంటూరు ఎమ్మెల్యేలు..!

మరోవైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా నుంచి రెండు నిమిషాల స్పెషల్ వీడియో వస్తుందని లీకులు వచ్చినప్పటికీ.. మే 19, 20 తేదీల్లో ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇంకా లాంచ్ కూడా కాని ఈ సినిమా కోసం ఏకంగా ఏఐతో ఒక ప్రత్యేక వీడియోను కూడా టీమ్ రెడీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఈ అప్‌ డేట్స్ ఏవీ రాకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. తన పుట్టినరోజు నాడు డ్రాగన్ సినిమా గ్లింప్స్ తప్ప మరే ఇతర అప్‌ డేట్స్ బయటకు వద్దని ఎన్టీఆర్ స్వయంగా కొరటాల శివకు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్లు సమాచారం.

Also Read : గ్రీన్ కార్డ్ ఆశావహులకు అమెరికా బిగ్ షాక్..!

ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రాన్ని ఎన్టీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఏకంగా నాలుగున్నర నిమిషాల నిడివితో వదిలిన ఆ మెగా గ్లింప్స్ సృష్టించే హైప్, బజ్.. వేరే సినిమాల అప్‌ డేట్స్ రావడం వల్ల డైల్యూట్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ టీమ్ రెడీ చేసిన ప్రత్యేక వీడియోను పక్కన పెట్టేసినట్లు కాదు. జూన్ నెలలో సరికొత్త షాక్‌ వేవ్‌ కు ఈ కాంబో ప్లాన్ చేస్తోంది. త్రివిక్రమ్ రెడీ చేసిన ఆ స్పెషల్ ఏఐ వీడియోను జూన్ 11న గ్రాండ్‌ గా లాంచ్ చేయబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్