Wednesday, May 6, 2026 07:56 PM
Wednesday, May 6, 2026 07:56 PM

టీ బీజేపీలో కలకలం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాషాయ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీని ముందుండి నడిపించే నేత ఎంపిక ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎంపిక జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల అబ్జర్వర్‌లను కూడా పార్టీ ఢిల్లీ పెద్దలు నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే అధ్యక్షుని ఎంపిక జరుగుతోంది. పేరుకే ఎన్నిక అయినప్పటికీ.. ప్రక్రియ అంతా ఏకగ్రీవమే. పార్టీ హై కమాండ్ నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌లో ఉన్న నేత రాష్ట్ర అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నారు. అంతే తప్ప.. ఈ నామినేషన్ ప్రక్రియ అంతా పేరుకే. అయితే ఈ అధ్యక్ష ఎన్నిక పట్ల పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బాబుతో సమావేశానికి డుమ్మా కొట్టిన నాయకులు వీరే..?

తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులను మారుస్తోంది. తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ పురంధేశ్వరి ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నట్లు ఢిల్లీ పెద్దలు వెల్లడించారు. ఇందుకోసం ఈ రోజు నామినేషన్లు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే.. రేపు ఎన్నిక నిర్వహిస్తారు. కానీ ఇదంతా కేవలం పైకి మాత్రమే. రాష్ట్ర పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయం ఇప్పటికే పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

తెలంగాణలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు, ఏపీ బాధ్యతలను మాధవ్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాధవ్ ఎంపిక విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రామచందర్ రావు విషయంలో పలువురు నేతలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే తన అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లే పార్టీలో ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికే పార్టీ ఆఫీసుకు తాను వచ్చినట్లు తెలిపారు. అయితే తన మద్దతుదారులను కొంతమంది బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్