Tuesday, August 4, 2026 11:46 PM
Tuesday, August 4, 2026 11:46 PM

మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

రెండు రోజుల క్రితం మహా న్యూస్ కార్యాలయం పై జరిగిన దాడి వ్యవహారం లో వైసీపీ కార్యకర్తల పాత్ర కూడా ఉందని ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉండే మహా న్యూస్ ఇటీవల కాలంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తీవ్రంగానే వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. 2019 నుంచి 23 వరకు పెద్ద ఎత్తున ఫోన్ టాపింగ్ జరిగింది అనేది మహా న్యూస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నారు.

Also Read : మంత్రులలో ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం..?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఫోన్ అలాగే మహా న్యూస్ వంశీ మారెళ్ళ ఫోన్ కూడా టాప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఫోన్ టాపింగ్ కు సంబంధించి తమ కథనాల్లో భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి దాడికి దిగారు. ఆ సమయంలో వారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ దాడిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది వైసీపీకి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారని భావిస్తున్నారు. వాళ్లకు గులాబీ పార్టీ జెండాలు వేసి తీసుకు వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దాడికి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : కేఆర్‌పీఎస్‌కి తాత్కాలిక బ్రేక్..!

జగన్ పై నేరుగా విమర్శలు చేసే మహా న్యూస్ పై వైసీపీ కార్యకర్తలు కూడా కొంతకాలంగా ఆగ్రహంగానే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మహా న్యూస్ ఛానల్ పై విమర్శలు చేస్తూ వచ్చారు.. ఈ దాడి తర్వాత దాడిని సమర్థిస్తూ వైసిపి సోషల్ మీడియా పోస్టలు కూడా పెట్టింది. దాడికి రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ చేరుకున్న వారికి గులాబీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. మరి ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా త్వరలోనే దీనిపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్