Thursday, August 13, 2026 12:18 PM
Thursday, August 13, 2026 12:18 PM

కుప్పంలో ఎయిర్‌పోర్టు.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ

కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ అంశంపై డీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పారు.

Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!

డీఎంకే ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన.. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను పట్టుకొని రాజకీయం చేయొద్దని.. శాసనసభలో స్పష్టమైన ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. హోసూరు నగరం తమిళనాడులోనే ఉన్నా.. బెంగళూరు సిటీలో కలిసిపోయినట్లు ఉంటుంది. కానీ హోసూరులో ఎయిర్‌పోర్టుకి అదే అడ్డంకి‌గా మారింది. బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకి 150 కిలోమీటర్ల దూరం వరకు మరో విమానాశ్రయం నిర్మించకూడదు అనే రూల్ ఉంది. దీనికి తోడు హోసూరులో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యుద్ధ విమానాలు తయారు చేసే.. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ సంస్థ పరిశోధన కేంద్రం ఉంది. హెచ్‌ఏఎల్‌ పరిధిలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో విమానాలు ఎగరకూడదు.

బెంగూళరు ఎయిర్‌పోర్టుకి 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉండటం.. హెచ్‌ఏఎల్ నో ఫ్లై జోన్‌ నిబంధనల కారణంగా హోసూరులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతులు రాలేదు. కానీ డీఎంకే ఎమ్మెల్యే మాత్రం ఏపీ, కర్నాటక కుట్ర చేస్తున్నాయని ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. తమిళనాడు మినిస్టర్ కీర్తన ఇదే విషయాన్ని చెప్పి.. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. కుప్పం కూడా బెంగళూరు ఎయిర్‌పోర్టుకి 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకొని కొన్ని షరతులతో కుప్పంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ తీసుకొంది. ఎన్‌వోసీ రావడంతో టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టులో కుప్పం ఎయిర్‌పోర్టుకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

Also Read : గ్రూప్‌ 1 అక్రమాలు నిజమే.. వైసీపీకి షాక్‌ ఇచ్చిన సిట్‌

కుప్పంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం లాజిస్టిక్స్‌ హబ్‌గా మారుతుంది. కుప్పంతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగం పుంజుకొంటోంది. కుప్పం ఎయిర్‌పోర్టుతో రాయలసీమలో ఉద్యాన పంటల ఎగుమతులు పెరిగి.. రైతులకు మేలు జరుగుతుంది. విమానాశ్రయం కోసం అవసరమైన 1788 ఎకరాల్లో 1300 ఎకరాలను ఇప్పటికే సేకరించారు. క్యాపెక్స్ విధానంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఖర్చులో 15 శాతం మార్జిన్‌పై,, విమానాశ్రయం ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ నిర్వహణకు బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో ఒప్పందం చేసుకోవడంతో.. షరతులతో కూడిన ఎన్‌ఓసీ వచ్చింది. సమస్యలను పరిష్కరించి, అడ్డంకులను అధిగమించి.. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు హోసూరులో అన్ని అనుకూలతలు ఉన్నా ప్రభుత్వం ఎయిర్‌ నిర్మాణానికి చొరవ చూపించడం లేదని అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేసే పనులు చేస్తోందని.. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతన్న రాజకీయం స్పష్టం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

గ్రూప్‌ 1 అక్రమాలు...

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ వన్...

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.....

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న...

డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు...

వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్‌ సక్సెస్...

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

పోల్స్