Saturday, May 23, 2026 05:39 PM
Saturday, May 23, 2026 05:39 PM

బెజవాడ థార్ గొడవ వెనుక రాజకీయ వారసులు

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల వీధి పోరాటం ఇప్పుడు బెజవాడలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. డబ్బు ఉందనే అహంతో, ఓ అమ్మాయి కోసం నడిరోడ్డు మీద జరిగిన ఈ చిల్లర పంచాయితీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటన వెనుక ఉన్న అసలు రంగులు, వారి వెనుక ఉన్న రాజకీయ పలుకుబడి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తిన్నది అరగక, చేతిలో డబ్బు, వెనుక రాజకీయ అండ ఉందనే అహంకారంతో సామాన్య ప్రజలు తిరిగే రోడ్డుపై ఈ స్థాయికి దిగజారడం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : చంద్రబాబుకు తల నొప్పిగా గుంటూరు ఎమ్మెల్యేలు..!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గొడవ జరిగిన తర్వాత కారు టైర్ పంచర్ కావడంతో అక్కడి నుండి చాకచక్యంగా పారిపోయిన యువకుడు మరెవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తమ్ముడి కొడుకు. అలాగే, అక్కడే ఉండి రాడ్‌ తో కారు అద్దాలు పగులగొట్టి రౌడీయిజం చేసిన మరో యువకుడు.. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ మేనల్లుడు కావడం గమనార్హం. ఈ బరితెగింపు అంతా ఒక అమ్మాయి కోసం జరిగింది. సదరు అమ్మాయిని ఇంకొక యువకుడు తన వెంట తిప్పుకుంటున్నాడనే కుళ్లు, అసూయతో ఈ రాజకీయ వారసులు నడిరోడ్డుపై కార్లతో దాడులకు తెగబడ్డారు.

గొడవ జరుగుతున్న సమయంలో ఆ అమ్మాయి కూడా వీరిలో ఒకరి కారులోనే ఉంది. ఒకరి కారును మరొకరు రాడ్లతో అద్దాలు పగులగొట్టుకుంటూ, కార్లతో ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు తక్షణమే స్పందించి ఈ రౌడీ బ్యాచ్ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. బెజవాడ నగరంలో ఇలాంటి వికృత చేష్టలు జరగడం ఇదే మొదటిసారి కాదు. విజయవాడలోని అత్యంత కీలకమైన బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ సిగ్నల్, రమేష్ హాస్పిటల్ సిగ్నల్ పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు రాత్రి పూట ఈ బడా బాబుల కొడుకులు విలాసవంతమైన కార్లతో రాష్ డ్రైవింగ్ చేస్తూ రేసులకు దిగడం నిత్యకృత్యంగా మారిపోయింది.

అర్ధరాత్రి దాటిన తర్వాత సైలెన్సర్లు తీసేసి, అతివేగంతో దూసుకుపోతూ సామాన్య వాహనదారుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పోలీసులు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, జరిమానాలు వేసినా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కారణం ఏదైనా కావచ్చు.. వీరు చేసిన పని ముమ్మాటికీ నేరం. ఇలాంటి ఒక్క తప్పుడు పని వారి జీవితాలనే కాదు, వారి కుటుంబాల ప్రతిష్టను కూడా మంటగలుపుతుంది. పిల్లలు ఎలా పెరుగుతున్నారో గమనించడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత.

Also Read : బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ పిలుపు.. యాక్షన్ కు రంగం సిద్దం..?

డబ్బుంది కదా అని విలాసవంతమైన కార్లు కొనిచ్చి రోడ్లపైకి వదిలేస్తే సరిపోదు. వాటితో పాటు క్రమశిక్షణను కూడా నేర్పించాలి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే గతంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఉదంతం. కాలేజీలో తోటి విద్యార్థిపై దాడి చేసి, ఆ వీడియో వైరల్ అవ్వడంతో బండి భగీరథ్ చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఒక్క తప్పుడు పని అతని జీవితాన్ని మార్చేయడమే కాకుండా, ఇప్పుడు రాజకీయంగా అత్యంత కీలక స్థానంలో, కేంద్రంలో మంత్రిగా ఉన్న అతని తండ్రి బండి సంజయ్ రాజకీయ ప్రతిష్టను కూడా తీవ్రంగా దెబ్బతీసింది.

కొడుకు చేసిన తప్పుకు తండ్రి సమాజానికి, మీడియాకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ బెజవాడ థార్ గొడవలో ఉన్న బడా బాబులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాసేపటికి ఎలాగూ వీళ్ల డాడీస్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యక్షమైపోయి.. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, ఈ ఎంపీ తెలుసు, ఆ మంత్రి నా అనుచరుడే అంటూ నానా హడావిడి చేసి, లాబీయింగ్‌ తో కేసులను నీరుగార్చి తమ పిల్లలను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మళ్లీ కొత్త కార్లు కొనిచ్చి రోడ్డుపైకి వదిలేస్తే వీరు రేపు మరిన్ని పెద్ద నేరాలకు తెగబడతారు. కాబట్టి, బెజవాడ పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, ఈ రౌడీ బ్యాచ్ యొక్క బెండు తీసి, నగరంలో రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ రాష్ డ్రైవింగ్ సంస్కృతికి శాశ్వతంగా చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ కాదు… ఇది...

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

పోల్స్