తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఏపీ సిఎం చంద్రబాబుకు రాసిన లేఖ ఆసక్తిని రేపుతోంది. ఇటీవల పార్లమెంటులో, బయట రాష్ట్ర విభజన అంశంపై బీజేపీ, టీడీపీ మరియు జనసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ లేదా అనుచితంగా జరిగిందంటూ బీజేపీ ఎంపీలు, టీడీపీ నేతలు మరియు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ప్రజల మధ్య అనవసరమైన ద్వేషాలను రగిలించేలా ఉన్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Also Read : పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫేవరేట్ డైరెక్టర్ రీ ఎంట్రీ..!
దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇప్పుడు మళ్ళీ విభజన ప్రక్రియను తప్పుబడుతూ మాట్లాడటం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అధికార కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ మరియు జనసేన నాయకులను చంద్రబాబు కట్టడి చేయాలని పొన్నం కోరారు. కూటమికి పెద్దన్నగా మీరు చొరవ తీసుకుని, విభజనపై అసందర్భ వ్యాఖ్యలు చేయకుండా మీ మిత్రపక్షాలకు సర్దిచెప్పాలి.
Also Read : బర్త్ డే గిఫ్ట్ అదిరింది కదా చంద్రయ్యా..!
తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది” అని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ ఒక్క ఎంపీ కూడా విభజనపై అనుచితంగా మాట్లాడకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా లోక్‌సభ స్పీకర్ కు చంద్రబాబు లేఖ రాయాలని ఆయన కోరారు. బయటి రాష్ట్రాల నాయకులు తెలుగు రాష్ట్రాల అంతర్గత, చారిత్రక అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

