Tuesday, April 21, 2026 03:40 PM
Tuesday, April 21, 2026 03:40 PM

మొత్తానికి హిట్ కొట్టిన టాలీవుడ్..!

టాలీవుడ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. దాదాపు 4 నెలల తర్వాత బాక్సాఫీస్ దగ్గర జనాల సందడి కనిపిస్తోంది. థియేటర్లు ప్రేక్షకులతో కాస్త కళకళలాడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఎగ్జిబిటర్లు డబ్బు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత సరైన హిట్ సినిమా లేక దర్శక, నిర్మాతలు లబోదిబో అంటున్నారు. అటు సినీ ప్రేక్షకులు కూడా సరైన తెలుగు సినిమా లేక మళయాళం, తమిళ్, హిందీ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌కు తొలి హిట్ సినిమా డెకాయిట్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి ఐదు పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్, ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్, రవితేజ హీరోగా చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలీశెట్టి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలు వారం రోజుల వ్యవధిలోనే థియేటర్లలో సందడి చేశాయి. కలెక్షన్ల పరంగా చూస్తే రాజాసాబ్ మాత్రం నిర్మాతకు నిరాశ మిగిల్చిందనట్లు టాలీవుడ్ లెక్కలు చెబుతున్నాయి . మిగిలిన సినిమాలన్నీ లాభాలు తెచ్చినవే.

Also Read : ‘చేతబడిపై చర్యలు తీసుకోండి.. సీఎస్‌కే పేరుతో ఫేక్ లెటర్..!

సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌లో సరైన హిట్ సినిమా లేదనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్ నాలుగు రోజుల సినిమా అని తేలిపోయింది. ఇక రామ్ చరణ్ సినిమా పెద్ది, నాని హీరోగా వస్తున్న ప్యారడైజ్ సినిమాల మీద టాలీవుడ్ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అవి రెండూ షూటింగ్ ఆలస్యం కారణంగా.. సమ్మర్‌లో కూడా రిలీజ్ కావటం లేదు. దీంతో ఈ ఏడాది సంక్రాంతి తర్వాత సరైన సినిమా లేదని టాలీవుడ్ మొత్తం లబోదిబో అంటున్న పరిస్థితుల్లో డెకాయిట్ భారీ ఊరట ఇచ్చింది.

సంక్రాంతి తర్వాత నాలుగు నెలలకు వచ్చిన డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన విజేతగా నిలిచింది. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో వచ్చిన మొదటి నిజమైన హిట్ ఇదే. ఈ సినిమా పంపిణీదారులందరికీ లాభాలు అందించింది. ఇప్పటి పరిస్థితుల్లో అది చిన్న విషయం కాదు. చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగా సాధిస్తున్న సమయంలో, డెకాయిట్ మాత్రం క్లియర్‌గా సేఫ్ జోన్‌లోకి వెళ్లింది.

Also Read : ముంబైకి మకాం మార్చిన బన్నీ..?

రెండో వారంలోకి వచ్చినా కూడా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు, కొత్త సినిమాల రిలీజ్‌లు ఉన్నా కూడా ఈ స్థాయిలో నిలబడటం సినిమా రన్‌కి ఉన్న బలం చూపిస్తుంది. ఈ చిత్రంతో తన బాక్సాఫీస్ స్టామినాను అడవి శేషు మరోసారి నిరూపించాడు. కంటెంట్ పెద్దగా కొత్తగా ఏమీ లేకపోయినా, ప్రెజెంటేషన్, ప్రేక్షకులతో కనెక్ట్ అవడం వల్ల మంచి ఫలితం వచ్చింది. మొత్తానికి, స్లోగా సాగుతున్న సమ్మర్ సీజన్‌కి డెకాయిట్ మంచి ఊపు తీసుకొచ్చింది. సంక్రాంతి తర్వాత నిజమైన హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకుల నమ్మకం ఉంటే సాదారణ కథతో కూడా భారీ విజయం సాధించవచ్చని మరోసారి చూపించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జనసేన వర్సెస్ టీడీపీ.....

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం...

సీఎం చంద్రబాబుకు మంత్రి...

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఏపీ...

ఏపీలో విచిత్రం.. నేతల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష...

బర్త్ డే గిఫ్ట్...

వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామిరెడ్డికి...

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం...

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై...

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

పోల్స్