Thursday, May 14, 2026 08:34 PM
Thursday, May 14, 2026 08:34 PM

బాలయ్య కోసం మలయాళ హీరోయిన్ రీ ఎంట్రీ..?

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య, యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ శరవేగంగా పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టులోకి మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఎంట్రీ ఇస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ గా మారింది.

Also Read : విరాట్ కోహ్లీ విశ్వరూపం.. కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డులు..!

2023 సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య, హనీ రోజ్ మధ్య కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌ లో రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అందులో ఆమె మీనాక్షి అనే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ముఖ్యంగా సుగుణ సుందరి సాంగ్‌ లో వీరిద్దరి డాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ తో ఈలలు వేయించాయి. ఆ సినిమా తర్వాత తెలుగులో హనీ రోజ్‌ కు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ పెరిగినా.. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు.

Also Read : పొదుపు బాటలో ఏపీ సర్కార్.. చంద్రబాబు నుంచి పెమ్మసాని వరకు..!

అయితే బాలయ్య సరసన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్‌ గా సెట్ అవుతుందని నమ్మిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఈ కొత్త సినిమాలో ఓ పవర్‌ ఫుల్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ కోసం మళ్లీ హనీ రోజ్‌ ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ పీరియాడికల్ డ్రామాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ ఫుల్ మాఫియా డాన్‌ గా కనిపించనున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం నడుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు కాజల్ అగర్వాల్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరితో పాటు హనీ రోజ్ కూడా తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌ పై అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే హనీ రోజ్ ఎంట్రీపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బండి భగీరథ్‌ కు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పొదుపు బాటలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పొదుపు...

నా కోసం ట్రాఫిక్...

సాధారణంగా రాజకీయ నాయకులు వెళ్తున్న సమయంలో...

దస్తగిరి హ*త్య కేసులో...

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్...

సీమకు రాయల్ కళ.....

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా...

లోకేష్ ట్వీట్స్ కు...

ఏపీ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి...

పోల్స్