Friday, May 22, 2026 08:30 PM
Friday, May 22, 2026 08:30 PM

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్.. ఏపీకి మేలు ఎవరితో..?

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో “చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్” అంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఆయన ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఏ విధమైన స్నేహం ఉందనే దానికంటే, ఆ స్నేహం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయనేదే అత్యంత కీలకం. ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రాక్టికల్ గా విశ్లేషిస్తే, కేవలం మాటల కంటే క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి, వచ్చిన నిధులే అసలైన సాక్ష్యాలుగా నిలుస్తాయి.

Also Read : ఏపీలో రాజ్యసభ సందడి.. మళ్ళీ వీళ్ళేనా..?

సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఏ రకమైన మిత్రుడైనప్పటికీ, గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న మద్దతు, నిధుల ప్రవాహం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, నిధులు మంజూరయ్యాయి. దశాబ్దాలుగా నలుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఆటంకాలు తొలగించి, ప్రత్యేక గ్రాంట్లు కేటాయించడం ద్వారా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి లైన్ క్లియర్ చేశారు.

ఇవే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్లు, కొత్త నేషనల్ హైవేల అభివృద్ధి పనులు రాష్ట్రంలో శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇటీవల రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్ కు శంకుస్తాపన్న కూడా పుట్టపర్తిలో జరిగింది. విభజన హామీల్లో కీలకమైన రైల్వే జోన్ వచ్చింది. కీలకమైన అమరావతి బిల్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఏ ఇబ్బంది లేకుండా బిల్ ఆమోదం పొందింది. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం నుండి పనులు సాధించుకోవడంలో ఈ వ్యూహాత్మక బంధం విజయవంతమైందని చెప్పవచ్చు.

Also Read : మీరు తేనెపూసిన కత్తులు.. జగన్ పై విరుచుకుపడ్డ పార్థసారథి రెడ్డి

మరోవైపు, ఐదేళ్ల పాటు కేంద్రానికి ‘లాంగ్ టర్మ్ ఫ్రెండ్’ లాగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను గమనిస్తే రాష్ట్రానికి జరిగిన లబ్ధి చాలా తక్కువనే విమర్శలు ఉన్నాయి. ఆ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఎలాంటి భారీ అంతర్జాతీయ పెట్టుబడులు రాలేదు సరే కదా, ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని పూర్తిగా అటకెక్కించడమే కాకుండా, తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేలా చేసి ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ సాధనలో అడుగు ముందుకు పడలేదు, డిఫెన్స్ కారిడార్ లేదా రక్షణ పరిశ్రమల ఊసే లేకుండా పోయింది.

కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారనే విమర్శలు సైతం ఉన్నాయి. చివరకు ఐదేళ్ల పాలన ముగిసే సమయానికి రాష్ట్రానికి మిగిలింది కేవలం తీర్చలేనంత అప్పుల భారం మాత్రమే. రాజకీయాల్లో తాత్కాలిక లేదా శాశ్వత స్నేహాలు అనే సమీకరణాల కంటే, ఏ నాయకత్వం వల్ల రాష్ట్రానికి హక్కులు, నిధులు సాధించబడుతున్నాయి అనేదే ముఖ్యం. ఏపీని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించి, అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్రంతో సమర్థవంతంగా డీల్ చేయగల పటిష్టమైన వ్యూహాలు ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి ఇప్పుడు అత్యంత అవసరం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

షా దృష్టిలో చంద్రబాబు...

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం...

మీరు తేనెపూసిన కత్తులు.....

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాత.....

పోల్స్