Wednesday, August 12, 2026 02:00 PM
Wednesday, August 12, 2026 02:00 PM

యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..!

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి, ముఖ్యంగా భారత ఐటీ నిపుణులు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చే వార్త చెప్పింది. యూఎస్ వీసా ప్రాసెసింగ్ మరియు లీగల్ ఇమ్మిగ్రేషన్ సేవలను వేగవంతం చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను భారీగా ఉపయోగించుకోవాలని హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ ఈ సరికొత్త డిజిటల్ విప్లవానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.

Also Read : చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి పోస్టింగ్.. అసలు కారణమేంటి?

ఈ కొత్త ప్రణాళికలో భాగంగా, రాబోయే 30 రోజుల్లోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక దశలో డాకా (DACA) ప్రోగ్రామ్ కింద పెండింగ్‌ లో ఉన్న దరఖాస్తుల భారీ బ్యాక్‌ లాగ్‌ ను క్లియర్ చేయడంపై ఈ ఏఐ సిస్టమ్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీనివల్ల నెలల తరబడి నిలిచిపోయిన ఫైళ్లు క్షణాల్లో ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో దరఖాస్తుదారులు వీసా ఫారమ్‌ లలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వీసా రావడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతుంటుంది.

Also Read : వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!

ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ ను గూగుల్ పూర్తి స్థాయిలో రీడిజైన్ చేస్తోంది. ఇకపై కొత్త విధానంలో.. అప్లికేషన్ పూర్తిగా మరియు ఖచ్చితంగా నింపేంతవరకు సిస్టమ్ దానిని సబ్మిట్ చేయనివ్వదు. టెక్నాలజీ సాయంతో దరఖాస్తు తప్పులను ముందే నివారించడం ద్వారా వీసా ఆమోదాల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీనితో పాటు దరఖాస్తుదారులకు ఇమ్మిగ్రేషన్ సేవలను మరింత వేగంగా చేరువ చేయడానికి కామర్స్ డిపార్ట్‌మెంట్‌ తో కలిసి ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ ను కూడా రూపొందిస్తున్నట్లు ముల్లిన్ తెలిపారు. ఈ మొబైల్ యాప్ ఆలోచనను తానే స్వయంగా అమెరికా అధ్యక్షుడికి వివరించగా, ఆయన దీనిని ఎంతగానో మెచ్చుకున్నారని పేర్కొన్నారు. అయితే వీసా ప్రాసెసింగ్‌ను స్పీడప్ చేస్తున్నప్పటికీ, భద్రతా తనిఖీల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడేది లేదని, మరింత కఠినమైన నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

పోల్స్