ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్మికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను జీఏడీ, జీపీఎం, ఏఆర్ శాఖాధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఖాళీగా ఉన్న అదే పోస్టులో ఎప్పుడో శ్రీలక్మిని నియమిస్తే బాగుండేది కదా. నిజానికి ఆమె చేసిన నేరం ఏమిటి..? తప్పు ఏమిటో.. సీఎం చంద్రబాబు చెప్పాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని ప్రాధాన్యత పోస్టుల్లో నియమించిన సీఎం చంద్రబాబు, శ్రీలక్మి విషయంలో మాత్రం కావాలని ఆమెకు రెండేళ్ల నుండి పోస్టింగ్ ఇవ్వకుండా తప్పు చేశారు. జూన్ 30 తేదీన ఆమె రిటైర్ కాబోతున్నారు. సరిగ్గా నాలుగు రోజుల ముందు శ్రీలక్మికి పధకం ప్రకారమే పోస్టింగ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మొహరం సెలవు, శని వారం, ఆదివారం… సోమవారం ఉదయం శ్రీలక్మి డ్యూటీలో జాయిన్ అయ్యి.. సాయంత్రం రిటైర్డు అవుతారు.
Also Read : వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఇప్పుడు ఏ తప్పూ చేయని ఒక మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారిణికి రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా.. ఇంటికే పరిమితం చేసిన ఘనత సీఎం చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. కాపు కులానికి చెందిన ఆమెకు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా.. రిటైర్మెంట్‌కు సరిగ్గా ఒక రోజు ముందే పోస్టింగ్ ఇవ్వటం బాధాకరం అని టీడీపీ కాపు ఎమ్మెల్యే లే ఆఫ్ ది రికార్డుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించని రౌడీ షీటర్‌ను, మర్డర్లు చేసిన వ్యక్తి కోసం వైసీపీ కాపు మాజీ మంత్రులు చేసిన హడావుడి ఇంతా, అంతా కాదు. కొన్ని రోజులు వరసగా నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహించి రెచ్చిపోయి, కాపు కులస్తులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వైసీపీ కాపు కులం మాజీ మంత్రులు, రెండేళ్ల నుండి కాపు కులానికి చెందిన ఒక సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్మికి పోస్టింగ్ ఇవ్వకపోయినా నోరు తెరవలేదు.
ఓ రౌడీ షీటర్ కనిపించటం లేదని అల్లరి చేసిన వైసీపీ కాపు నేతలు.. శ్రీలక్ష్మి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నిజానికి శ్రీలక్ష్మి జైలుకు వెళ్లడానికి, అవినీతి ఆరోపణలకు ప్రధాన కారణం.. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులోనే శ్రీలక్ష్మి జైలుపాలయ్యారు. నాటి వైఎస్ఆర్ సంతకం పెట్టమన్న చోట శ్రీలక్ష్మి సంతకాలు చేశారని.. అందుకే జైలుకు వెళ్లారనే విషయం అందరికీ తెలిసిన రహస్యం. అంతిమ లబ్దిదారు జగన్ కావడంతో.. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే.. శ్రీలక్ష్మిని తిరిగి ఏపీకి డిప్యూటేషన్‌పై తీసుకుని.. కీలక పోస్టింగ్ అప్పగించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను సస్పెండ్ చేశారు.
Also Read : బీజేపిలో యూపి ఫార్ములా.. ఆ కేంద్ర మంత్రులు అవుట్..?
ఎవరి వల్ల శ్రీలక్మి అన్ని విధాలుగా దెబ్బతిన్నారో.. వారే ఆమెకు అండగా నిలవలేదు. కేవలం 21 ఏళ్లకే ఐఏఎస్ అధికారిణి అయిన శ్రీలక్మి.. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ అవ్వాల్సిన అర్హతలున్నప్పటికీ.. ఆమెను అవస్థల పాలు చేసిందెవరో రాజకీయ, అధికార వర్గాలకు తెలుసు. రెండేళ్ల నుండి పోస్టింగ్ ఇవ్వకుండా, శ్రీలక్మిని అవమానించారు. గతంలో తప్పులు చేసినందుకు ఆమె భారీ ఎత్తున మూల్యం చెల్లించుకుని.. అనారోగ్యం పాలయ్యారు కూడా. పరువు, ప్రతిష్టలు కూడా పొగట్టుకున్నారు. ఆమెకు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా, రిటైర్‌మెంట్‌కు ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారంటే..!

