ఒకప్పుడు ఆయన వైసీపీ ఎమ్మెల్యే.. ఐదేళ్లు అధికారం చెలాయించి, అనేకమంది టీడీపీ కార్యకర్తలను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి బద్ధ వ్యతిరేకి అనే ముద్ర ఉంది. చంద్రబాబుపై అప్పట్లో చాలా విమర్శలు కూడా చేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవ్వకపోవటంతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిశారు. పార్టీ ఫండ్ భారీగానే ఇచ్చి టీడీపీ టికెట్ పొందారని.. అప్పట్లో టీడీపీ కార్యకర్తలే ఆఫ్ ది రికార్డుగా కామెంట్‌లు చేశారు.
Also Read : లోకేష్ సంచలన ప్రకటన.. దేశంలోనే తొలి రాష్ట్రం..!
ఆ ఎమ్మెల్యే పేరు ఆదిమూలం. ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుచేతల్లో ఉండే ఆదిమూలం.. చివరికి పెద్దిరెడ్డిని ఎదిరించి.. టీడీపీలో చేరి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదంతా గతం.. కొన్ని నెలలు క్రితం ఏమి జరిగిందంటే.. తనను బెదిరించి, బలవంతంగా ఎమ్మెల్యే ఆదిమూలం రేప్ చేసారని టీడీపీ మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తనపై ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళతో రాజీ చేసుకోవటంతో.. ఆమె పెట్టిన కేసును విత్ డ్రా చేసుకున్నారు.
అయినా కూడా ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్‌ను టీడీపీ అధిష్ఠానం ఎత్తి వేయకుండా.. వైసీపీ అభిమాన రెడ్డిని సత్యవేడు నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు చంద్రబాబు. ఈ నియామకం పై మండిపడ్డ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు.. మీడియా సమావేశం పెట్టి తమకు ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు అయ్యిందని.. ఆ సొమ్మును చెల్లించితే, తన తండ్రి ఆదిమూలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నారు. అయినా టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆదిమూలం, వైసీపీ నాయకులతో రహస్యంగా చర్చలు జరిపారనే విషయం బయటకు వచ్చింది.
Also Read : సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!
టీడీపీలో గుర్తింపు లేదు.. అధికారులు కూడా పట్టించుకోవటం లేదు.. వైసీపీ అభిమాన రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించటంతో పుండు పై కారం చల్లినట్లు భావించిన ఎమ్మెల్యే ఆదిమూలం, వైసీపీలో చేరి చంద్రబాబు, లోకేష్‌కు “షాక్ ” ఇవ్వాలని భావిస్తున్నారట. 2029 ఎన్నికల్లో తన కుమారుడికి వైసీపీ టికెట్ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీ పెద్దలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. రేపో మాపో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించి చంద్రబాబుకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలున్నట్లు సమాచారం. 2024లో చావు తప్పి కన్ను లోట్ట బోయి.. స్పల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి పై, టీడీపీ అభ్యర్థి ఆదిమూలం విజయం సాధించారు. కాబట్టి.. ఉప ఎన్నిక జరిగితే వైసీపీ అభ్యర్థి అవలీలగా విజయం సాధిస్తారన్న నమ్మకం వైసీపీ నేతలకు ఉందేమో..!

