Wednesday, August 12, 2026 02:55 PM
Wednesday, August 12, 2026 02:55 PM

ఈరోజు రాశి ఫలితాలు (27-06-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 27-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణ లాభలున్నవి.

—————————————

వృషభం

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

మిధునం

మాతృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులలో అడ్డంకులు తప్పవు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారాలలొ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం

ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

—————————————

సింహం

ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ప్రారంభించిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

—————————————

కన్య

వృత్తి వ్యాపారాలలొ నష్టాలు అధిగమించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వ్యవహారించాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటాబయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

—————————————

తుల

దూర ప్రయాణ సూచనలున్నవి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు.

—————————————

వృశ్చికం

దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల విస్తరణకు శ్రీకారం చుడతారు.

—————————————

ధనస్సు

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు వారికి లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

—————————————

మకరం

సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

—————————————

కుంభం

ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

—————————————

మీనం

జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

————————————-

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

పోల్స్