Saturday, June 27, 2026 12:15 PM
Saturday, June 27, 2026 12:15 PM

ఏపీ మ్యాప్ తో మార్కెట్లోకి జొన్నగిరి గోల్డ్..!

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బంగారు గని అయిన జొన్నగిరి నుంచి ఇప్పుడు అధికారికంగా పసిడి అమ్మకాలు మార్కెట్లోకి వచ్చేశాయి. స్థానికంగా వెలికితీసి, శుద్ధి చేసిన ఈ బంగారాన్ని సరికొత్త డిజైన్లతో విక్రయానికి సిద్ధం చేశారు. ఈ జొన్నగిరి బంగారు బిస్కెట్లపై ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక మ్యాప్‌ ను ముద్రించారు.

Also Read : బీజేపిలో యూపి ఫార్ములా.. ఆ కేంద్ర మంత్రులు అవుట్..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా, యాజమాన్యం ఆయనకు ఈ ప్రత్యేకమైన ఏపీ మ్యాప్ ఆకారంలోని బంగారాన్ని బహుకరించింది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఒక పెద్ద మ్యూజియంలో ఈ చారిత్రాత్మక పసిడి మ్యాప్‌ ను భద్రపరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోనే సొంతంగా ఉత్పత్తి అవుతున్న పసిడిని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో, సంస్థ దీనికి మన ఇంటికి మన బంగారం అనే వినూత్నమైన స్లోగన్‌ ను ఖరారు చేసింది.

Also Read : ఈ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ అలెర్ట్ ఆన్ చేసారా..?

వినియోగదారులు, పెట్టుబడిదారులు సులువుగా కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్లో ప్రాథమికంగా రెండు రకాల బరువుల్లో ఈ జొన్నగిరి గోల్డ్ బిస్కెట్లను విక్రయిస్తున్నారు. 100 గ్రాముల బంగారు బిస్కెట్లు, 500 గ్రాముల బంగారు బిస్కెట్లను విక్రయిస్తున్నారు. జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థల భాగస్వామ్యంతో రూ. 405 కోట్ల భారీ వ్యయంతో ఈ గనిలో వాణిజ్యపరంగా బంగారు వెలికితీత, ప్రాసెసింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ శుద్ధి చేసిన అత్యంత నాణ్యమైన బంగారాన్ని నేరుగా ఆంధ్రప్రదేశ్‌ లోని స్థానిక జ్యువెలరీ వ్యాపారులకు కూడా సరఫరా చేయనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సర్కార్ కు...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక...

చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి...

ఎట్టికేలకు సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి...

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పోల్స్