తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానుల మధ్య నలుగుతున్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ఫిలింనగర్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఒక ఉమ్మడి సమావేశం జరిగింది. టాలీవుడ్ కు చెందిన మూడు ప్రధాన రంగాల ప్రతినిధులు హాజరైన ఈ భేటీలో.. పరిశ్రమ మనుగడకు, థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సినిమా నిర్మాణ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, థియేటర్ల నిర్వహణ కూడా భారం కావడంతో ఇరు వర్గాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలను ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు.
Also Read : 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడతాడా..?
ఈ ఉమ్మడి సమావేశంలో ఎగ్జిబిటర్ల సెక్టార్ కు సంబంధించిన పర్సంటేజీ విధానం అంటే.. కలెక్ట్ అయ్యే టికెట్ రాబడిలో షేరింగ్ పద్ధతి పైనే అత్యధిక సమయం చర్చ సాగింది. ప్రస్తుతం ఉన్న లోకల్ థియేటర్ల రెంట్లు, మెయింటెనెన్స్ ఖర్చులు, మారుతున్న ప్రేక్షకుల సినిమా చూసే అలవాట్ల వల్ల పాత పద్ధతిలో బిజినెస్ చేయడం కష్టంగా మారిందని ఎగ్జిబిటర్ల వర్గం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో డిజిటల్ ల్యాబ్ ఖర్చులు, పబ్లిసిటీ మరియు విండో పీరియడ్స్ వల్ల తాము కూడా ఇబ్బందులు పడుతున్నామని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వివరించారు.
Also Read : మహేష్ ‘బాలీవుడ్ నన్ను భరించలేదు’ కామెంట్ పై విలన్ క్లారిటీ..!
ఎవరికీ నష్టం కలగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త పర్సంటేజీల ఫార్ములాను తీసుకురావాలని ఈ భేటీలో గట్టిగా డిమాండ్ వినిపించింది. ఈ అంతర్గత సమస్యలను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో సినిమాల విడుదలకు మరియు థియేటర్ల బిజినెస్ కు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు గ్రహించారు. అందుకే ఈ సమస్యను అత్యంత వేగంగా, సామరస్యపూర్వక వాతావరణంలో ముగించేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్సంటేజీల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి తేల్చేందుకు ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా ఉండేందుకు వీలుగా.. ఈ సబ్ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, మరియు డిస్ట్రిబ్యూటర్లకు సమాన ప్రాధాన్యం మరియు సమాన సంఖ్యలో సభ్యుల ప్రాతినిధ్యాన్ని కల్పించారు.

