Monday, May 18, 2026 02:16 PM
Monday, May 18, 2026 02:16 PM

స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ మోడళ్లపై రూ.3.5 లక్షల వరకు..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా మే 2026 నెలకు గాను తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా పాత ఇన్వెంటరీని క్లియర్ చేయడంపై దృష్టి పెట్టిన సంస్థ.. ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ లు, కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో గరిష్టంగా రూ.3.50 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన 2026 మోడళ్లపై ఆఫర్లు కాస్త తక్కువగా ఉన్నాయని, నగరాలు, డీలర్‌ షిప్‌ లను బట్టి ఈ డిస్కౌంట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : నాడు రాళ్ళ సీమ.. నేడు బంగారు సీమ..!

స్కోడా ఫ్లాగ్‌ షిప్ ఎస్‌యూవీ, స్కోడా కొడియాక్ పై ఈ నెలలో అత్యధికంగా రూ.3.50 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. దీని పాత వేరియంట్లపై రూ.2 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.1 లక్ష కార్పొరేట్ బెనిఫిట్, మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. ఇక మిడ్ సైజ్ ఎస్‌యూవీ స్కోడా కుషాక్ పాత స్టాక్ కొనుగోలుపై రూ.2 లక్షల క్యాష్ డిస్కౌంట్‌ తో కలిపి మొత్తం రూ.3 లక్షల వరకు ప్రయోజనాలు దక్కనున్నాయి. కొత్తగా వచ్చిన MY26 కుషాక్ మోడళ్లపై మాత్రం వేరియంట్‌ను బట్టి రూ.20,000, రూ.40,000 వరకు మాత్రమే ఆఫర్లు ఉన్నాయి.

Also Read : టాటా మోటార్స్ కష్టాలు.. భారీగా పడిపోయిన లాభాలు..!

కంపెనీకి చెందిన ప్రముఖ సెడాన్ స్కోడా స్లావియా, పాత స్టాక్ ప్రెస్టీజ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.1.40 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా, కొత్త MY26 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ.50,000 నుండి రూ.1 లక్ష వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇటీవలే లాంచ్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ స్కోడా కైలాక్ పై మిగిలిన కార్లతో పోలిస్తే ఆఫర్లు కాస్త మితంగా ఉన్నాయి. దీని పాత స్టాక్ సిగ్నేచర్ ట్రిమ్స్‌ పై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ బోనస్, మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తుండగా.. సరికొత్తగా వచ్చిన కైలాక్ వేరియంట్లపై గరిష్టంగా రూ.25,000 వరకు మాత్రమే ఎక్స్ఛేంజ్, లాయల్టీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్కోడా కారు కొనాలనుకునే వారికి పాత స్టాక్‌ పై ఉన్న భారీ డిస్కౌంట్ల వల్ల ఇది మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు...

అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న...

సైనికులకు రొయ్యలు పెట్టండి.....

రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా...

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

పోల్స్