Thursday, September 10, 2026 03:55 PM
Thursday, September 10, 2026 03:55 PM

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లేడీ ఆఫీసర్లకు సీఎం చంద్రబాబు శభాష్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై గత కొన్ని రోజులుగా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో తప్పుడు ప్రచారం సాగుతోందనే ఆరోపణలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రీడల కోటా మరియు టెట్ అర్హత మార్కుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ కొన్ని వర్గాలు కావాలనే వివాదాలు సృష్టించాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియపై నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించి, భయాందోళనలు రేకెత్తించేలా సాగిన ఈ ప్రచారం విద్యాశాఖకు పెద్ద సవాల్‌గా మారింది.

Also Read : అమెరికాలో కాగ్నిజెంట్ సంస్థకు భారీ షాక్..!

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. తమీమ్ అన్సారియా, సాప్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ఎస్. భరణి ధైర్యంగా ముందుకు వచ్చారు. సచివాలయంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఈ ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు.. అధికారిక రికార్డులను మీడియా ముందు ఉంచి ప్రతి ఒక్క ఆరోపణను పక్కా ఆధారాలతో ఖండించారు. నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేస్తూ దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also Read : అమ్మవారి బంగారానికే భద్రత లేదా..?

అమరావతిలో జరిగిన ‘8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు’ వేదికగా ఈ ఇద్దరు మహిళా అధికారుల చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీసేలా విమర్శలు వచ్చినప్పుడు అధికారులు వెనకడుగు వేయకుండా, వాస్తవాలను ధైర్యంగా ప్రజలకు వివరించాలని ఆయన కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, డీఎస్సీ వివాదంపై తమీమ్ అన్సారియా, భరణిలు వ్యవహరించిన తీరును, వారి సమర్థతను సీఎం చంద్రబాబు సభాముఖంగా కొనియాడారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చిన్న శ్రీను షాక్‌…...

విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా భావోద్వేగాల...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఎన్నారైల అండతో తెలుగుదేశం...

2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన...

లీప్ యాప్.. టీచర్లకు...

లీప్ యాప్.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్...

అమ్మవారి బంగారానికే భద్రత...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ...

స్థానిక ఎన్నికలు.. ‘మినీ...

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో...

పోల్స్