ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంస్థకు అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తోందనే ఆరోపణలతో, కాగ్నిజెంట్ సంస్థ కొత్తగా గ్రీన్ కార్డ్ దరఖాస్తులు చేయకుండా అమెరికా కార్మిక శాఖ తాత్కాలిక నిషేధం విధించింది. వీసా నిబంధనల దుర్వినియోగం మరియు మోసపూరిత విధానాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
Also Read : బొత్స మేనల్లుడు చిన్న శ్రీను చేరికతో టిడిపి కి లాభమా లేక నష్టమా?
అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. “అమెరికన్ కార్మికులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. మోసాలను అరికట్టేందుకు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి మేం పని చేస్తున్నాం. వాస్తవాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాం.. త్వరలోనే బేడీలు సిద్ధంగా ఉన్నాయి” అంటూ ఆయన హెచ్చరించడం గమనార్హం. కాగ్నిజెంట్‌తో పాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ క్లౌడెరా యొక్క PERM ఫైలింగ్స్‌ను కూడా అమెరికా నిలిపివేసింది.
Also Read : పీసీఓఎస్ సమస్యను డైట్, స్ట్రెంత్ ట్రైనింగ్‌తో నయం చేయవచ్చా..?
సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకునే ముందు కంపెనీలు PERM సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుత నిర్ణయం వల్ల కాగ్నిజెంట్‌లో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఈ నిషేధం కేవలం శాశ్వత గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్‌కు మాత్రమే వర్తిస్తుందని, తాత్కాలిక హెచ్-1బీ వీసాల ప్రక్రియపై దీని ప్రభావం ఉండదని నిపుణులు చెప్తున్నారు.

