Saturday, September 5, 2026 06:00 PM
Saturday, September 5, 2026 06:00 PM

సినిమాల్లో మహిళల గ్లామరైజేషన్‌పై తాప్సీ సంచలనం..!

ఇండియన్ సినీ పరిశ్రమలో.. మహిళా పాత్రల చిత్రీకరణ మరియు వారిని కేవలం శృంగారభరితంగా, గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఘాటుగా స్పందించారు. ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలైన రామ్ చరణ్ ‘పెద్ది’, యష్ ‘టాక్సిక్’ చిత్రాలలో మహిళా పాత్రల అతిగా చూపించాడంపై.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదాలపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. పరిశ్రమలో ఇటువంటి కంటెంట్‌ను సమర్థించుకోవడానికి మేకర్స్ చాలా సులభంగా ప్రేక్షకులపై నెపం నెట్టేస్తుంటారని మండిపడ్డారు.

Also Read : బిగ్ బాస్ 10 ఫైనల్ లిస్ట్ ఇదే..!

ఈ సందర్భంగా ఆమె ‘డిమాండ్ అండ్ సప్లై’ సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “జనాలు ఇలాంటివే కోరుకుంటున్నారు.. మేము ఇవ్వకపోతే డబ్బులు ఎలా సంపాదిస్తాం..?” అనే ధోరణిలో చిత్ర నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తున్నారని, దీనివల్ల కళ మరియు నైపుణ్యం పూర్తిగా పక్కకు పోతున్నాయని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి గ్లామర్ ఫోటోలను జూమ్ చేస్తూ, రకరకాల యాంగిల్స్‌లో వీడియోలు చేస్తూ వైరల్ చేసే ఒక వర్గం ప్రేక్షకులు ఉన్న మాట వాస్తవమేనని, కానీ దానినే సాకుగా చూపిస్తూ సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read : సన్నగా ఉన్నా పీసీఓఎస్ వస్తుందా..?

కోవిడ్ కంటే ముందు మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మంచి ప్రగతిని సాధించాయని, కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల్లోకి వెనక్కి వెళ్తున్నామని విమర్శించారు. సినిమాల్లో మహిళల గౌరవాన్ని కాపాడే ఈ పోరాటంలో నటీనటులు ఒంటరిగా గెలవలేరని, కేవలం ప్రేక్షకుల మద్దతుతోనే ఇది సాధ్యమవుతుందని తాప్సీ స్పష్టం చేశారు. ప్రేక్షకులు ఇలాంటి కంటెంట్‌ను తిరస్కరించినప్పుడే మార్పు వస్తుందని చెప్పారు. కాగా, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను హైపర్‌సెక్స్వలైజ్ చేయడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించగా, ‘టాక్సిక్’ సినిమాలో కూడా మహిళలను కేవలం గ్లామర్ కోణంలోనే చూపించారనే చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పేపర్ మిల్లు మూసేస్తారా.....

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు వెంటనే...

పోల్స్