Wednesday, September 9, 2026 07:07 PM
Wednesday, September 9, 2026 07:07 PM

ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలు

2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించగా, గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ పి. గురురాజా బాధ్యతలు స్వీకరించారు.

Also Read : క్షణాల్లో మాట మార్చేసిన వైసీపీ.. ఏందయ్యా ఇది..!

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ ఎన్టీఆర్ అని, రాజకీయాల్లో చదువుకున్నవారు, మేధావులు, యువతకు అవకాశాలు కల్పించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయడంతోపాటు ఏడుగురు ఎన్ఆర్ఐలకు అవకాశం కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు.

Nara Lokesh with NRI TDP Team

2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేష్ అన్నారు. అమరావతి ఉద్యమానికి ఎన్ఆర్ఐలు అండగా నిలిచి, కేసులకు భయపడకుండా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో 50 దేశాల్లోని 200 పట్టణాల్లో నిర్వహించిన ‘ఐయామ్ విత్ సీబీఎన్’ కార్యక్రమాలు తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని గుర్తుచేశారు.

APNRT and NRITDP Oath Taking

ప్రజాప్రభుత్వం ఏర్పాటులో ఎన్ఆర్ఐల కృషి మరువలేనిదని లోకేష్ ప్రశంసించారు. వేల డాలర్లు ఖర్చుచేసుకుని రాష్ట్రానికి వచ్చి ఓటు వేయడమే కాకుండా, ఉద్యోగాలకు సెలవులు పెట్టి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. ఎన్ఆర్ఐలు అంటే ‘మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్’ అని అభివర్ణించిన ఆయన, సొంత గ్రామాలు, పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Poll : బొత్స మేనల్లుడు చిన్న శ్రీను చేరికతో టిడిపి కి లాభమా లేక నష్టమా?

ఎన్ఆర్ఐలు తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని లోకేష్ కోరారు. వారు పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు మరింత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం, నేపాల్ సంక్షోభం వంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా చిక్కుకున్న తెలుగువారికి టీడీపీ అండగా నిలిచిందని గుర్తుచేశారు.

ఎన్ఆర్ఐ సభ్యత్వ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, ప్రతి ఒక్కరూ ‘మై టీడీపీ యాప్‌’తో అనుసంధానం కావాలని లోకేష్ సూచించారు. ఏ దేశంలో కనీసం పది మంది ఉన్నా ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ ఏర్పాటు చేయాలని, పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే 30 రోజుల్లో కమిటీల ఏర్పాటు పూర్తిచేసి, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లీప్ యాప్.. టీచర్లకు...

లీప్ యాప్.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్...

అమ్మవారి బంగారానికే భద్రత...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ...

స్థానిక ఎన్నికలు.. ‘మినీ...

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో...

ఏపీ పర్యాటక రంగానికి...

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి...

వైసీపీ హయాం మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...

పాదయాత్ర 2.O ముహూర్తం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త...

పోల్స్