ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్ల రూపాయల మద్యం రవాణా కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, కేంద్రీకృత రవాణా విధానాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చేకూర్చారనే బలమైన ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read : పాదయాత్ర 2.O ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..!
ఈ భారీ కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని విదేశాలకు మరియు ఇతర రంగాలకు దారి మళ్లించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేశారు. ఇందుకోసం ‘బోన్వౌర్’, ‘కాస్టా పింక్’ అనే నకిలీ సంస్థలను సృష్టించి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ నకిలీ కంపెనీల బ్యాంక్ ఖాతాల ద్వారానే కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చేతులు మారిందని, దీని వెనుక వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కీలక పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు..? సగం మందికి ఉద్వాసన..!
మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో కూడా వాసుదేవరెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించినట్లు తేలింది. ఎలాంటి ముందస్తు అనుభవం లేని ‘ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్’ అనే సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు రవాణా నిబంధనలను రాత్రికి రాత్రే మార్చేశారు. అర్హత కలిగిన మిగతా రవాణా సంస్థలను పక్కనబెట్టి, సదరు ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్‌కు అనుకూలంగా టెండర్లు కట్టబెట్టారని, దీని వెనుక పెద్ద ఎత్తున క్విడ్ ప్రో కో జరిగిందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ తాజా జీవోతో వాసుదేవరెడ్డి చుట్టూ లీగల్ ఉచ్చు మరింత బిగుసుకోగా, ఈ స్కామ్‌తో సంబంధమున్న మరికొందరు కీలక సూత్రధారులను కూడా విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది.

